ఏపీ సీఎం జగన్ ప్రవేశ పెడుతున్న పథకాల పై ప్రభుత్వం ఏ రేంజ్‌లో ప్రచారం కల్పిస్తోందో అందరికీ తెలిసిందే. ఆయా పథకాలను ఇప్పటి వరకు దేశంలో ఎవరూ ప్రవేశ పెట్టలేదని.. తాము మాత్రమే చేస్తున్నామని.. ఇంతలా ప్రజా సంక్షేమాన్ని ఎవరూ ఊహించ లేదని కూడా ప్రచారాన్ని ఊదరగొడుతోంది. కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే.. ఈ పథకాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ.. సొంత పార్టీ నేతలే ఫైరవుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.. ‘జగనన్న కాలనీలు-పేదలందరికీ ఇళ్లు’.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లను కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అయితే.. ఆదిలోనే కొందరు వైసీపీ నేతలు వీటిపై పెదవి విరిచారు. సెంటు స్థలంలో ఇల్లేంటి? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అప్పట్లో దీనిపై మౌనంగా ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు.. నేరుగా షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. బాహాటంగానే ఈ ఇళ్లపై హాట్ కామెంట్లు కుమ్మరించారు. `”పంచలో శోభనం చేసుకుని బెడ్ రూంలో పడుకునేలా ఈ ఇళ్లు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.
నెల్లూరు కలెక్టరేట్‌లో తాజాగా జగనన్న ఇళ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు రంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ సహా.. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ఇళ్లు చిన్న కుటుంబాలకి కూడా సరిపోవన్నారు. అర్బన్‌లో అయితే మరీ ఘోరంగా 6 అంకణాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాటిల్లో అయితే పంచలో శోభనం చేసుకుని బెడ్ రూంలో పడుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇళ్ల విస్తీర్ణం పెంచాలని, ఇళ్లు ప్రభుత్వమే నిర్మించాలని ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్ష నేతలు ఏ చిన్న విమర్శ చేసినా.. కేసులు పెడుతున్న జగన్ సర్కారు.. ఇప్పుడు సొంత ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on June 27, 2021 3:06 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…