గడికోట శ్రీకాంత్‌రెడ్డి. వైసీపీలో త్యాగాలు చేసిన నాయకుల్లో ఈయన కూడా ఒకరు. జగన్‌కు బెస్ట్ ఫ్రెండ్. ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆయన పార్టీకోసం ఎంతో శ్రమించారు. జగన్ సోనియాగాంధీని కలిసి బయటకు వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్న తొలి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డే. అప్పుడే ఆయన జగన్‌తో కలిసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఉప ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం సాధించారు. ఇక 2014 తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నుంచి వచ్చిన ఆహ్వానాలను కూడా కాదని.. ఆయన వైసీపీలోనే ఉండిపోయారు. జగన్ పాదయాత్ర సమయంలో కడపలో ఆయన కూడా సంఘీభావ పాదయాత్ర చేశారు. జగన్ సీఎం అయ్యేందుకు పొరుగు జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని సంఘటిత పరిచారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున మంచి వాయిస్ కూడా వినిపించారు.
దీంతో జగన్ ప్రభుత్వం ఏర్పడగానే గడికోటను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని.. ఆయన వర్గం భావించింది. కానీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడమే ఆయనకు ఇబ్బందులు వచ్చేలా చేసిందని అంటారు. ఇక, ఈ క్రమంలోనే గడికోటకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. అయితే.. ఆయన మంత్రి వర్గంలో చోటు లభించకపోవడంపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. తనకు తగిన పదవి ఇవ్వలేదని.. దీంతో జిల్లాలో తలెత్తుకుని తిరగలేకపోతున్నానని.. ఆయన తన అత్యంత సన్నిహిత వర్గాల వద్ద తరచుగా వాపోతున్నారు. పైగా జిల్లాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హవానే ఎక్కువైపోయింది.
ఈ క్రమంలో త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన జరగనున్నందున ఇప్పటికైనా తనకు అవకాశం దక్కుతుందని.. గడికోట భావిస్తున్నారు. దీనిపై ఆయన అనుచరులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో ఒక్క మైనార్టీ నాయకుడికి తప్ప మంత్రి పదవిని ఎవరికీ ఇవ్వలేదు. సో.. ఈ క్రమంలో తనకు ఖచ్చితంగా అవకాశం చిక్కుతుందనేది గడికోట ఆశలు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో సీఎం జగన్ వ్యూహం వేరేగా ఉంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక కోణంలోనే తను ప్రచారానికి దిగి.. ఓట్లు దక్కించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలో తాను రెడ్డి వర్గం నుంచి ఏకంగా ముఖ్యమంత్రిగా ఉండడంతో మరో రెడ్డి నేతకు పదవి ఇవ్వరనే అంటున్నారు. అదే జరిగితే శ్రీకాంత్ రెడ్డికి మరోసారి నిరాశ తప్పదు. ఇప్పటికే ఆయన విప్‌గా ఉండడంతో ఆయన్ను ఇంకెలా శాంత పరుస్తారో ? చూడాలి.
This post was last modified on June 26, 2021 3:45 pm
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…