భారత రాష్ట్రపతి రైలు ప్రయాణం చేశారు. అది కూడా 15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం చేశారు.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తన సతీమణి సవితాదేవితో కలిసి తమ స్వస్థలం కాన్పూర్‌కు రైలులో వెళ్లారు.
దిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్టపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేబోర్డు చైర్మన్, సీఈఓ సునీల్ శర్మ వీడ్కోలు పలికారు. 15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2006లో అప్పటి భారత రాష్టపతి అబ్దుల్ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు.
కాగా.. రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వెళ్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురా వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్ తన పాత పరిచయస్థులను, పాఠశాల స్నేహితులను కలిసి మాట్లాడనున్నారు.
ఆ తరువాత తన స్వగ్రామానికి చేరుకుంటారు. స్వగ్రామాన్ని సందర్శించిన అనంతరం జూన్ 28వ తేదీన కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషనులో రైలు ఎక్కి లక్నోకు చేరుకుంటారు. తదనంతరం జూన్ 29వ తేదీన ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు.
This post was last modified on June 26, 2021 11:45 am
ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా విషయాల్లో వాటి…
అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో దేశానికి స్వర్ణ యుగం తీసుకువస్తానని ప్రకటిం చారు.…
కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో…
ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా…
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…