కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఓ ఆటాడుకుంటోంది. తగ్గినట్లే తగ్గడం మళ్ళీ విజృంభిస్తుండటంతో చాలా దేశాలకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. కరోనా మహమ్మరి సమస్య ఎప్పటికి పోతోందో కూడా ప్రపంచానికి తెలియంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే తమ దేశాల్లో కరోనా వైరస్ తగ్గిపోయింది కాబట్టి మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొన్ని దేశాలు ప్రకటించిన విషయం గుర్తుందికదా. ఇపుడా దేశాల్లో మాస్కులు పెట్టుకోమని కాదు ఏకంగా లాక్ డౌనే విధించేశాయి.
తమ దేశాల్లో కరోనా కేసులు మాయమైపోయాయని కాబట్టి జనాలు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మొదటి ప్రకటించిన దేశం ఇజ్రాయెల్. ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించేయటంతో జనాలందరో పోలోమంటూ రోడ్లపైకి వచ్చేశారు. సినిమా హాళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బు ఒకటేమిటి ఎక్కడ చూసినా జనాలే. దాంతో మాయమైపోయిందనుకున్న మహమ్మారి మళ్ళీ విజృంభించింది. దంతో మాస్కులు పెట్టుకోమని కాదు ఏకంగా లాక్ డౌనే విధించేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఎందుకంటే వందల్లో కేసులు నమోదవుతున్నాయి మరి.
ఒక్క ఇజ్రాయెల్ దేశమే కాదు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, ఫిజీ ఐల్యాండ్స్, ఆఫ్రికాలోని దాదాపు 14 దేశాలు, రష్యా రాజధాని మాస్కో, కాంగో, ఉగాండా దేశాల్లోని ప్రభుత్వాలు మళ్ళీ లాక్ డౌన్ విధించేశాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ కు మందనేది లేదు. రాకుండానే కాదు వచ్చిన తర్వాత నయం చేసుకునేందుకు కూడా మందులేదు. కరోనా సోకకుండా ఉండేందుకు ఏకైక మార్గం ఏమిటంటే భౌతికదూరం పాటించటమే.
వీలైనంతలో ఇళ్ళల్లో నుండి బయటకు రాకుండా ఉండటమే ఏకైక రక్షణ మార్గం. మనంతట మనం ఆహ్వానిస్తే కానీ కరోనా వైరస్ ఎవరి ఒంట్లోకి రావటంలేదన్నది వాస్తవం. జనాలకు డిసిప్లిన్ లేకపోవటమే అతిపెద్ద సమస్యగా మారిపోయింది. దీన్నే కరోనా అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. దీంతో చాలా దేశాల్లో సమస్య మళ్ళీ పెరిగిపోతుండటంతో యుద్ధ ప్రాతిపాదికన చాలా దేశాలు మళ్ళీ లాక్ డౌన్ పెట్టేస్తున్నాయి.
This post was last modified on June 26, 2021 11:39 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…