ఏపీ సీఎం జగన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు రద్దు చేయమని కోరకుండానే.. బాధ్యత వహించాలని.. ఏ ఒక్క విద్యార్థికి కరోనా సోకినా.. రూ. కోటి పరిహారం చెల్లించాలని హెచ్చరించింది. దీంతో జగన్ సర్కారు పరీక్షల విషయంలో వెనక్కి తగ్గింది. ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే.. ఇప్పుడు జగన్ సర్కారు కు భారీ షాక్ తగిలింది. అది కూడా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నుంచి కావడం గమనార్హం.
సీఎం జగన్ సర్కారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఏడాదిన్నర పైగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యేనల్‌లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఈ నిర్మాణాన్ని సాగించవద్దని.. ట్రైబ్యునల్ కొన్నాళ్ల కిందటే ఏపీ సర్కారుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ.. జగన్ మాత్రం మా పరిధిలో మేం కట్టుకుంటుంటే తప్పేంటి? అన్న విధంగా వ్యవహరిస్తూ.. నిర్మాణాన్ని కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా దీనిపై విచారణ జరిగిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడితే.. జైలుకు పంపుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్జీటీ హెచ్చరించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా పనులు చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోదంటూ.. ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ధిక్కరణ వేసిన పిటిషన్‌ను విచారించిన హరిత ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతోపాటు చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది. మరి ఇప్పటికైనా జగన్ వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి. కాగా, ఇదే విషయంపై కొన్ని రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి తీసుకోకుండా.. చేస్తున్న నిర్మాణం ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరించడం గమనార్హం.
This post was last modified on June 25, 2021 3:38 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…