మన వైద్య నిపుణులు, డాక్టర్లు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఒక డాక్టరంటారు. కాదు కాదు చాలా తీవ్రంగా రాబోతోందని మరో వైద్య నిపుణుడుంటారు. థర్డ్ వేవ్ తీవ్రత విషయంలో డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞుల్లోనే ఇన్ని వాదాలుంటే జనాలు ఎవరిని నమ్మాలి ? అసలు వైద్యరంగంలోని ప్రముఖుల మధ్యే ఇంత గందరగోళం ఎందుకుంటోందో అర్ధం కావటంలేదు.
సెప్టెంబర్-అక్టోబర్ మధ్య థర్డ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కొందరు నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే మరికొందరు నిపుణులు దీనికి విరుద్ధంగా ప్రకటనలిస్తున్నారు. సెకెండ్ వేవ్ తో పోల్చుకుంటే థర్డ్ వేవ్ మరీ అంత ప్రమాధకరం కాదని మరికొందరు ప్రకటిస్తున్నారు. ఏదేమైనా సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉంటుందో లేకపోతే కాస్త తక్కువగా ఉంటుందో ఎవరు చెప్పలేకున్నది వాస్తవం.
అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక శాస్త్రజ్ఞుడో నిపుణుడో థర్డ్ వేవ్ తీవ్రత ప్రమాధకరంగా ఉంటుందని జనాలు ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరించిన వెంటనే ఇంకొకరు దానికి విరుద్ధంగా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారో అర్ధం కావటంలేదు. డాక్టర్లు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల్లో థర్డ్ వేవ్ పై కనిపిస్తున్న గందరగోళం మొత్తం సమాజాన్నే గందరగోళంలోకి నెట్టేస్తోందన్నది వాస్తవం.
అయితే జనాలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీవ్రత విషయాన్ని పక్కనపెట్టేస్తే భౌతికదూరం, మాస్కుల వాడకం, శానిటైజర్ల వినియోగంలో గనుక అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ కరోనా వైరస్ విజృంభణ తప్పదు. డాక్టర్లు ఏమి చెబుతారన్నది వేరే విషయం. జనాలు మాత్రం ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాల్సిందే అని మొదటి రెండు దశల్లో చాలా స్పష్టంగా బయటపడింది.
This post was last modified on June 24, 2021 10:58 am
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…