ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కి నందమూరి వారసుడు చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని… ఇటీవల చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య కృష్ణ.. కొడాలి నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బూతుల మంత్రి అని ముద్ర వేసుకొని కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ వీడియో విడుదల చేయడం గమనార్హం.
ఒక మంత్రి హోదాలో ఉండి నోటికి ఎంతొస్తే.. అంత వెధవ, సన్నాసి, దద్దమ్మ అంటూ లోకేష్ ను తిడతావా అంటూ మండిపడ్డారు. లోకేష్ ను వేస్ట్ ఫెలో అని ముద్ర వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించారని అలాంటి వ్యక్తిని విమర్శించే అర్హత నానికి ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 12వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. టీడీపీ పై కొడాలి నాని, వైసీపీ నేతలు దుర్భాషలాడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను విమర్శించే బదులు పాలనపై దృష్టి సారిస్తే మంచిదని వైసీపీ నేతలకు నందూమరి చైతన్య కృష్ణ సూచించారు.
This post was last modified on June 23, 2021 10:53 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…