అప్పుడెప్పుడో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. అయిపోయిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులుచేసిన కాంట్రాక్టర్ల పరిస్ధితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించటంలేదు. 2018-19లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో జరిగిన పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు.
2018-19లో పనుల బిల్లులను 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత చెల్లించాలి. కానీ ప్రభుత్వం మారిపోవడంతో అంతా తారుమారైపోయింది. ఆ దెబ్బకు అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు రాలేదు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులపై కోర్టులో కేసు వేశారు. ఆ విచారణలో కోర్టు ప్రభుత్వాన్ని గట్టిగానే చివాట్లు పెట్టింది.
అయిపోయిన రెండు పనులకు సంబంధించిన బిల్లులు రు. 50 లక్షలు కూడా లేదు. అలాంటిది డబ్బులు లేవన్న సాకుతో బిల్లులు ఆపేయటం జగన్ కు ఎంతమాత్రం తగదు. ఒకవైపు వేల కోట్లరూపాయాలను సంక్షేమానికి ఖర్చుపెడుతున్నట్లు జగనే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు రెండు బిల్లులను చెల్లించేందుకు డబ్బులు లేవంటే ఎవరైనా నమ్ముతారా ?
ఇదే ప్రశ్న కోర్టు కూడా అడిగింది. మరి ఉన్నతాధికారులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. టీడీపీ హయాంలో జరిగిన పనులకు తామెందుకు బిల్లులు చెల్లించాలనే ఆలోచనలో ఉంటే అది పూర్తిగా తప్పని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. పనులు చేసిన కాంట్రాక్టర్లు టీడీపీ నేతలే అయ్యుండచ్చు అయినా అయిపోయిన పనులకు బిల్లులు ఆపటం మాత్రం తప్పే. మరి తన తప్పును జగన్ ప్రభుత్వం ఎప్పుడు సరిచేసుకుంటుందో ?
This post was last modified on June 23, 2021 10:35 pm
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…