Political News

ముంచుకొస్తున్న డెల్టా ఫ్లస్.. ఇది మరీ డేంజర్!

కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం సృష్టించింది. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ లో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే.. దాని నుంచి కోలుకుంటున్నాం. కాగా.. అంతలోనే.. ఈ మహమ్మారి మరో రూపంలో పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండో దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి. అయితే ఇది ఇప్పటికే మూడు రాష్ట్రాలకు పాకినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైతే కేంద్రం దీన్ని “వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా” మాత్రమే వర్గీకరించింది. దాని తీవ్రతను బట్టి ఆందోళనకర వేరియంట్‌గా వర్గీకరించాలో లేదో నిర్ణయించనుంది.

అయితే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో డెల్టాప్లస్‌ వేరియంట్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా రత్నగిరిలో తొమ్మిది కేసులు బయటపడగా.. జల్‌గావ్‌లో ఏడు, ముంబయిలో రెండు, పాల్ఘర్‌, ఠానే, సింధుదుర్గ్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. మే 15 నుంచి 7,500 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా 21 కేసులను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే డెల్టాప్లస్‌ వేరియంట్‌తో మహారాష్ట్రలో మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.

మరోపక్క కేరళలో కూడా మూడు కేసులు, మధ్యప్రదేశ్‌ ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 64 ఏళ్ల మహిళ నుంచి సేకరించిన నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడోముప్పుపై వార్తలు వస్తోన్న క్రమంలో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించడం కొనసాగించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

This post was last modified on June 22, 2021 6:09 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

4 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

5 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

6 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

9 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

10 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

12 hours ago