కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకున్న దేశాలన్నీ ఏమవుతున్నాయో ప్రపంచం కళ్లారా చూస్తోంది. ఒక ఇటలీ.. ఒక అమెరికా.. ఒక స్పెయిన్ ఎంత మూల్యం చెల్లించాయో.. ఇప్పుడు చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు కూడా లేక ఎలా హాహాకారాలు చేస్తున్నాయో చూస్తున్నాం. త్రుటిలో తప్పింది కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి పరిస్థితినే ఈ సరికి ఎదుర్కొంటుండేది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాస్త ముందే స్పందించి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను కనుక వాయిదా వేయకపోతే ఈసారికి ఏపీ నాశనమైపోయేది. ఎన్నికల వల్ల నాయకులు, వారి వెంట కార్యకర్తలు, పార్టీల అభిమానులు ప్రచారాల పేరిట ఇల్లిల్లూ తిరగడం.. వ్యూహరచనల పేరిట సమావేశమవుతుండడం వంటివన్నీ ఉండేవి.. అంతేకాదు, మద్యం, డబ్బు చేతులు మారేది. ఇవన్నీ కూడా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యేవే. కానీ.. ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంతో ఉపద్రవం తప్పింది.
అయితే ముఖ్యమంత్రి జగన్ వాదన ఏంటంటే… కేవలం పది కేసులే కదా అవి కూడా విదేశీ రిటర్నీలవి అన్నారు. మార్చి 29 వరకు కొందరు జగన్ వాదనను సమర్థించారు కానీ తబ్లిగి జమాత్ ఇష్యూ బయట పడ్డాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముఖ్యంగా ఏపీకి, దేశానికి దేవుడిలా మారిన విషయం అర్థమైంది.
నిజానికి కమిషనర్ నిర్ణయంపై సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి జగనే తీవ్ర విమర్శలు చేశారు.. ఒక పారాసెట్మాల్ మాత్ర వేసుకుంటే పోయే కరోనా వైరస్ కోసం ఎవరైనా ఎన్నికలు వాయిదా వేస్తారా? ఇదంతా టీడీపీ కుట్ర.. టీడీపీ హయాంలో నియమించిన కమిషనర్ చేసిన కుట్ర.. ఇదంతా కమ్మ కుల కుట్ర అంటూ జగన్ చాలా ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఆరోపణలు చేయడంతో ఇక ఆయన మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అదే పల్లవి ఎత్తుకున్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.. కానీ, కోర్టు ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను గుర్తుచేసి కమిషన్‌దే అంతిమ నిర్ణయమని చెప్పింది. దాంతో ఎన్నికల వాయిదా తప్పలేదు.
ఇదంతా పక్కన పెడితే…. లాక్ డౌన్ 24 నుంచి పెట్టారు కాబట్టి అంతకు ముందే జెడ్పీటీసీ, ఎన్నికలు ముగిసి ఉండేవి. అయితే, ఇక్కడే ఘోర ప్రమాదం తప్పించారు నిమ్మగడ్డ. అది ఎలాగో చూద్దాం. మార్చి 13-16 మధ్య ఢిల్లీ ముస్లిం సదస్సుకు ఏపీ నుంచి చాలా మంది వెళ్లొచ్చారు. దాదాపు అన్ని జిల్లాల నుంచి దీనికి వెళ్లొచ్చారు. అందరూ మగవాళ్లే.
అంటే ఓటింగ్ కి ముందే ఏపీలో సుమారు 200 మందికి కరోనా సోకిన విషయం తాజాగా తేలింది. ఎందుకంటే ఇపుడు బయట పడిన 226 కేసుల్లో 200 లకు పైగా కేసులు తబ్లిగి జమాత్ వే. ఎన్నికలు వాయిదా వేసి ఉండకపోతే ఓట్లు అడిగేందుకు వెళ్లే నాయకులు ప్రచారంలో భాగంగా వీరిని హగ్ చేసుకునో, షేక్ హ్యాండ్ ఇచ్చో ఎన్నికల ప్రచారం చేసేవారు. వీరిని ముట్టుకున్న తర్వాత వారు ఇతరులు చాలామందిని కలిసేశారు. అలా మొదటి దశ పూర్తి కాకుండానే ఏపీలో కరోనా మూడో దశలోకి వెళ్లి ఉండేది.
అంతేకాదు, ఆ కరోనా వ్యాధి గ్రస్తులు ఓట్లేయడానికి వచ్చినపుడు క్యూలో, పోలింగ్ బూత్ లో ఇంకెంత మందికి వ్యాపించేదో. ఒక బూత్ లో వెయ్యి ఓట్లుంటాయి. కరోనా రోగి ఓటు వేసేటపుడు బూత్ లోని అనేక ప్రదేశాలను ముట్టుకుంటాడు… ఆ తర్వాత వాటిని ముట్టుకున్న ఇతర ఓటర్లకు కరోనా సోకేది. అలా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విచ్చలవిడిగా పాకిపోయేది.
ఇటలీ కంటే దారుణంగా మనం శవాలను లెక్కపెట్టుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే… ఓటేసేకి వృద్ధులు కచ్చితంగా వస్తారు. వారికి సోకితే అది ప్రాణాంతకమే. ప్రస్తుతం ఏపీలో ఉన్న సదుపాయాలతో కేవలం 3000 మందిని మాత్రమే ప్రాణాంతకమైతే కాపాడగలం. అంతకుమించి వెంటిలేటర్లు ఏపీలో లేవు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటూనే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఒకవేళ నిజంగా షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలు జరిగితే రాష్ట్రం ఏమైపోయేదో ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది.
ఏపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే…
మార్చి 9 నుంచి మార్చి 29 వరకు నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు నిత్యం షెడ్యూల్ ఉంది. మార్చి 9 నుంచి 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ.. మార్చి 17 నుంచి 19 వరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.. మార్చి 21న ZPTC, MPTC (పరిషత్ ఎన్నికలు) ఎన్నికల పోలింగ్.. ఉంది. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ విధించారు కాబట్టి మిగతావి రద్దయ్యేవి. కానీ అప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయేది.
ఈ లెక్కను జగన్ చెబుతున్నట్టు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు… నిమ్మగడ్డ కాపాడింది చంద్రబాబును కాదు, ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ప్రాణాలను, భారతదేశ పరువును, జగన్ పదవిని నిమ్మగడ్డ రమేష్ కాపాడారు. నిజానికి ఏపీ ప్రజలందరూ జగన్ తో పాటు మనసులోనే నిమ్మగడ్డకు కృతజ్జతలు చెప్పినా సరిపోదు.
This post was last modified on April 9, 2020 6:44 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…