కాలానికి మించిన కఠినమైన వాస్తవం మరొకటి ఉండదు. రాజును పేదలా.. అంతకుమించిన దారుణపరిస్థితుల్లోకి తీసుకెళ్లి శక్తి సామర్థ్యాలు ఒక్క కాలానికి మాత్రమే చెల్లు. తాజా ఉదంతం గురించి చదవితే ఈ మాట ఎంత నిజమన్నది ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కీలక నేత.. కాలం పుణ్యమా అని బతుకు జీవుడా అని భారత్ కు శరణార్ధిగా వచ్చి.. మారుమూల ప్రాంతంలో తలదాచుకుంటున్న సిత్రమైన పరిస్థితి తాజాగా వెలుగు చూసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
భారత్ కు కాస్త పొరుగునే ఉన్న మయన్మార్ లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. ఆ దేశంతో భారత్ కు 1633 కి.మీ. సరిహద్దు ఉంది. మయన్మార్ లో ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రస్తుతం ఆ దేశాన్ని సైన్యం తన గుప్పిట్లో ఉంచుకొని పాలిస్తోంది. సైనికుల దారుణాలతో ఆ దేశ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఏ నిమిషాన ఏ ఆయుధం పేలుతుందో.. తమ ఊసురు తీస్తుందోన్న ఆందోళనతో గడుపుతున్నారు. ఇప్పటికే సైనికుల దురాగతాల కారణంగా వందల ప్రాణాలు గాల్లో కలిశాయి.
ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితుల్ని భరించలేక భారత్ కు పారిపోయి వచ్చి.. శరణార్ధుల మాదిరి బతుకుతున్న వారు చాలామందే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు తొమ్మిది వేల మంది వరకు భారత్ కు వలస వచ్చేశారు. అలా వచ్చిన వారిలో ఇరవై మంది ప్రజాప్రతినిధులు ఉంటే.. అందులో ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉండటం విశేషం.
చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సలై లియన్ లుయై.. నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ పార్టీకి చెందిన నేత. అదేనండి.. మయన్మార్ స్వాంత్య్రం కోసం పోరాడిన ఆంన్ సాన్ సూకీ తెలుసు కదా. ఆమెకు చెందిన పార్టీకి చెందిన వారు. మయన్మార్ లో పరిస్థితులు దారుణంగా మారటంతో ప్రాణభయంతో భారత్ కు బతుకుజీవుడా అని వచ్చేశారు. అలా వచ్చిణ శరణార్దుల్లో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. శరణార్ధులుగా వచ్చిన వారిని మానవతా కోణంలో మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే.. అందుకు సానుకూలంగా స్పందించింది.
దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. మిజోరాంలోని మిజోల పూర్వీకులు.. మయన్మార్ లోని చిన్ సమాజానికి చెందిన వారు ఒకరే. అందుకే భావోద్వేగ బంధంతో వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. సైనిక దురాగతాలకు బెంబేలెత్తి పోయి భారత్ కు శరణార్ధిగా వచ్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిజోరంలోని ఒక మారుమూల పల్లెలో ఆయన ఆశ్రయం పొందినట్లుగాచెబుతున్నారు.
This post was last modified on June 16, 2021 8:31 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…