పచ్చని, ప్రశాంత దీవులలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చిచ్చుపెట్టింది. కేరళకు ఆనుకునుండే లక్షద్వీప్ లో నిబంధనల పేరుతో బీజేపీ మంటలు పెట్టాలని చూసింది. కానీ చివరకు ఆ మంటలు పార్టీకే అంటుకున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే లక్షద్వీప్ లో జనాభా సుమారు 85 వేలు. ఇందులో 95 శాతం ముస్లిం మైనారిటీలే ఉంటారు.
ఇలాంటి ద్వీపంలో స్ధానికులకు వ్యతిరేకంగా ఉండే చట్టాలను అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కుమార్ తెచ్చారు. దాంతో ఇపుడు ద్వీప్ లో ఆందోళనమొదలయ్యాయి. ఇంతకీ కొత్త నిబంధనలు ఏమిటంటే ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువుంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీకి అనర్హులట. ఇప్పటివరకు మొత్తం 10 దీవుల్లో ఒక్కచోట మాత్రమే మద్యం దొరుకుతుంది. అలాంటిది ఇపుడు అన్నీ దీవుల్లోను మద్యానికి అనుమతులు ఇచ్చేశారు.
అలాగే గో మాంసాన్ని తినటం నిషేధించారు. చివరగా గూండా చట్టాన్ని పట్టుకొచ్చారు. ఈ చట్టం కింద ఎవరైనా అరెస్టు చేస్తే ఏడాదివరకు కోర్టులో కూడా ప్రవేశపెట్టక్కర్లేదు. ఇలాంటి చట్టాలను పట్టుకొచ్చిన అడ్మినిస్ట్రేటర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో కేంద్రం కాస్త వెనక్కుతగ్గింది. ఇదే సమయంలో లక్షద్వీప్ లో బాగా పాపులరైన నటి, దర్శకురాలు, నిర్మాత, మోడలైన ఆయేషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు.
ఇంతకీ ఆమెమీద రాజద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే అడ్మినిస్ట్రేటర్ ను సుల్తానా జీవాయుధంగా వర్ణించారు. దాంతో ఆమెపై కేసు పెట్టారు. అసలే ముస్లిం మైనారిటిలుండే ద్వీపం. పైగా కేసు పెట్టింది కూడా చాలా పాపులరైన ముస్లిం సెలబ్రిటీపైనే ఇంకేముంది లక్షద్వీప్ లో మంటలు ఒక్కసారిగా రాజుకుంది. ఎప్పుడైతే ఆయేషా మీద రాజద్రోహం కేసు పెట్టారో వెంటనే ముస్లింలు మండిపోయారు.
రాజద్రోహం కేసు మంటలు బీజేపీలోని కీలక నేతలకు బాగా తగిలింది. వెంటనే 15 మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాలు చేసేశారు. ఇదే విషయమై మొన్నటి మేనెలలలోనే 10 మంది సీనియర్లు రాజీనామా చేశారు. ప్రశాంతంగా ఉండే లక్షద్వీప్ లో చిచ్చుపెట్టి లబ్దిపొందుదామని ప్రయత్నించిన కేంద్రానికి ఇపుడు అదే రివర్సులో తగులుకుంది. మరి తాజా కేసు విషయంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on June 15, 2021 8:20 am
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…