దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఆ అధికారం నేరుగా ప్రజలు ఇవ్వటం వల్ల వచ్చిందికాదు. కొన్ని రాష్ట్రాల్లో మెజారిటి లేకపోయినా అధికారంలోకి వచ్చేసింది. ఫలితాల సమయంలోనే ముందుగా మేల్కొనటం ద్వారా ప్రత్యర్ధిపార్టీలకు చెందిన ఎంఎల్ఏలను లోబరుచుకోవటం తదితర మార్గాల్లో అధికారంలోకి వచ్చేసింది.
అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియాకు గాలమేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది. దాంతో ప్రభుత్వం పడిపోగానే తాను అధికారంలోకి వచ్చేసింది. దాంతో బీజేపీ నుండి తమ ఎంఎల్ఏలను కాపాడుకోవటానికి కాంగ్రెస్, ఇతర పార్టీలు నానా అవస్తలు పడాల్సొస్తోంది. కర్నాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే పశ్చిమబెంగాల్లో తగిలిన ఎదురుదెబ్బ నుండి బీజేపీ తట్టుకోవటం కష్టంగా తయారైందట. ఎప్పుడే ఎంఎల్ఏ బీజేపీని వదిలేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోతారో తెలీక అగ్రనేతలు నానా టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మాతృసంస్ధ తృణమూల్లో చేరిపోయారు. దాంతో అదేదారిలో మరికొందరు ఎంఎల్ఏలు, నేతలు కూడా రెడీ అయిపోతున్నారు.
ముకుల్ దారిలోనే వెళ్ళాలని అనుకుంటున్న ఎంఎల్ఏలందరినీ బీజేపీలోనే ఉంచటానికి అగ్రనేతలు ఇబ్బందులు పడుతున్నారట. ఎంఎల్ఏలతో చర్చల కోసం ఏర్పాటుచేసిన రెండు సమావేశాలకు ఇప్పటికి ఎనిమిది మంది హాజరుకాలేదట. బీజేపీ శాసనసభా నేత సువేందు అధికారి ఫోన్లు చేసినా రెస్పాండ్ కావటంలేదని సమాచారం. సువేందు కూడా ఫిరాయింపు నేతే కావటం గమనార్హం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫిరాయింపు నేతలకు కానీ లేదా బీజేపీ ఎంఎల్ఏల్లో కొందరికి సువేందుతో ఏమాత్రం పడదట. అధికారానికి దూరంగా ఉండటం సాధ్యంకాక కొందరు, సువేందు అధికారితో పడక మరికొందరు ఎంఎల్ఏలు బీజేపీని వదిలేయటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఎదుటిపార్టీల్లో నుండి ఎంఎల్ఏలను లాక్కోవటానికే అలవాటుపడిపోయిన బీజేపీ అగ్రనేతలకు ఇపుడు అలాంటి ఫిరాయింపులను కాపాడుకోవటంలో తలనొప్పులేంటో తెలుస్తోందా ?
This post was last modified on June 14, 2021 10:27 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…