Political News

ఈటల విషయంలో సస్పెన్స్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికపై సస్పెన్స్ మొదలైంది. రాజీనామా ద్వారా జరగబోయే ఉపఎన్నికలో ఈటలే పోటీచేస్తారా ? లేకపోతే ఆయన భార్య జమునారెడ్డి పోటీచేస్తారా అనే చర్చ మొదలైంది. ఎంఎల్ఏగా రాజీనామా చేయగానే బీజేపీలో చేరాలని ఈటల డిసైడ్ చేసుకున్నారు.

బీజేపీ అభ్యర్ధిగా ఈటల మాత్రమే పోటీ చేయాలని కమలంపార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారట. తనకు బదులుగా తన భార్య జమునను పోటీలోకి దింపితే ఉపయోగం ఉండదని బీజేపీ నేతలు ఇప్పటికే ఈటలకు స్పష్టంగా చెప్పారట. భార్యను ఉపఎన్నికలో పోటీ చేయించి గెలిపించుకునే ఆలోచనలో మాజీమంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి నియోజకవర్గంలో బీజేపీ బలం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఈటల నిలబడినా, భార్య నిలబడినా సొంత బలం మీద గెలవాల్సిందే. బీజేపీ నుండి ఓట్ల సహకారం అందుతుందని ఈటల ఏమాత్రం ఆశించేందుకు లేదు. ఇలాంటి నేపధ్యంలో ఎవరు పోటీచేస్తే ఏమిటనేది ఈటల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అయితే తమ అభ్యర్ధిగా ఈటల పోటీచేస్తేనే ఊపుంటుందని అలాకాదని ఆయన భార్య పోటీచేస్తే ఇంత ఊపుండదనేది కమలనాదుల ఆలోచన.

ఇదే సమయంలో ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీయార్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈటల ఇప్పటికప్పుడు రాజీనామా చేసినా ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఎవరు చెప్పలేకున్నారు. మామూలుగా అయితే ఆరుమాసాల్లో ఉపఎన్నిక జరగాలి. కానీ ఇపుడు కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే అందరు ముందుగా ఈటల రాజీనామా తర్వాతే వ్యూహాలు బయటపెట్టాలని అనుకుంటున్నారు. మరి ఈ నేపధ్యంలో ఈటల ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on June 9, 2021 4:48 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

6 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

7 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

8 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

9 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

9 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

10 hours ago