Political News

రాష్ట్రాలకు మోడీ సర్కారు వారి ‘టీకా రూల్స్’

దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశీయంగా టీకా సంస్థలు తాము ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రానికి ఇచ్చి.. 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు సెక్టార్ కు ఇవ్వనున్నట్లగా చెప్పారు. ఉచిత వ్యాక్సిన్ మాట చెప్పిన మోడీ.. రాష్ట్రాలకు ఏ తీరులో అలాట్ చేస్తారన్న కీలక అంశాన్ని మాత్రం వ్యూహాత్మకంగా వెల్లడించలేదన్న అభిప్రాయం ఉంది.


ఇదలా ఉంటే. తాజాగా రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన టీకాల్ని మోడీ సర్కారు పంపుతుందన్నది ప్రశ్నగా మారింది. కాస్త దానికి సంబంధించి దేశంలోని అన్న రాష్ట్రాలకు ఉత్తర్వుల రూపంలో ఈ సందేహాలకు చెక్ పెట్టేలా చేసింది. దీని ప్రకారం జనాభా.. వ్యాధి తీవ్రత.. కేసుల సంఖ్యను ప్రాతిపదికన రాష్టాలకు టీకా పంపిణీ ఉంటుందని చెప్పారు.

కరోనా కేసులు రోజువారీగా ఎక్కువగా వ్యాక్సినేషన్ జరగని రాష్ట్రాల్లో అత్యధిక ప్రాధాప్యత ఇవ్వనున్నారు. అంతేకాదు.. అన్నిరాష్ట్రాలు టీకానుఏదోలా కొనుగోలు చేసే పనిలో బిజీబిజీగా ఉంది. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్వకాల్ని చూస్తే..

  • టీకా ప్రాధాన్యతలో మొదటి స్థానం ఆరోగ్య కార్యకర్తలకు.. ఫ్రంట్ లైన్ వర్కర్లకు. .45 ఏళక్లకు పైబడిన వారికి ఇవ్వాలి
  • రెండో డోసు వేసుకునే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. 18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాస్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల వారు వారికి వారే ప్లాన్ చేసుకోవాలి.
  • రాష్ట్రాల్లో టీకా వేస్టేజ్.. కేటాయింపులపై ప్రతికూల ప్రభావాన్నిచూపిస్తుంది.
  • టీకా డోసుల గురించి రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తుగా సమాచారం ఇస్తారు.
    అదే రీతిలో జిల్లాలు సైతం వ్యాక్సిన్ కేంద్రాలకు ముందుగా డోసుల వివరాలు వెల్లడించాలి. ప్రజలకు చెప్పాలి.
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరపై సేవా రుసుము రూ.150 మాత్రమే తీసుకోవాలి. ఈ విషయాన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు గుర్తించాలి
  • కొవిన్ యాప్ తో మాత్రమే కాదు.. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద కూడా ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పించాలి.

This post was last modified on June 8, 2021 5:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

16 minutes ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

1 hour ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

1 hour ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

4 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

5 hours ago