పార్లమెంట్ లో అందాల ఎంపీ ఎవరబ్బా అనగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది.. సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. పలు సినిమాల్లో తన నటన, అందంతో అలరించిన ఆమె తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఈ బామ చిక్కుల్లో పడింది. ఏకంగా తన పదవినే కోల్పోయే పరిస్థితిలో పడింది. తప్పుడు ధ్రువపత్రాలతో ఆమె ఎంపీగా గెలుపొందిందని.. కోర్టులో నిరూపితమైంది.
ఇంతకీ మ్యాటరేంటంటే.. నవనీత్ కౌర్.. తాను ఎస్సీ అని చెప్పి ఆ సర్టిఫికేట్ చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే.. ఆమె సమర్పించిన సర్టిఫికేట్ ఫేక్ అని తేలింది. ఆమె అసలు ఎస్సీ కులానికి చెందిన వారు కాదని.. తప్పుడు సర్టిఫికెట్లతో అమరావతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారని కోర్టులో నిరూపితమైంది.
మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం ఎస్సీ కులానికి కేటాయించినది. కాగా.. తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. బాంబే హైకోర్టు ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ ని ప్రస్తుతం క్యాన్సిల్ చేసింది. దీంతో.. ఆమె తన ఎంపీ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. నవనీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆమె లబానా అనే కులానికి చెందిన వారు కాగా..దీనిని ఎస్సీ క్యాటగిరిలో చేర్చలేదు. అయితే.. ఫేక్ సర్టిఫికెట్స్ చూపించి.. ఆమె ఎస్సీ గా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
ఆ పిటిషన్ ని పరిశీలించిన న్యాయస్థానం.. ముందుగా ఈ విషయంపై పోలీసులను దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. కాగా.. తాజాగా నేడు ఈ కేసు మళ్లీ పరిశీలనకు రాగా.. ఆమె తప్పుడు పత్రాలను సృష్టించినట్లు తెలియడంతో.. వాటిని న్యాయస్థానం కొట్టివేసింది.
This post was last modified on June 8, 2021 3:58 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…