కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల చూసినా దీని గురించే చర్చ. ఈ మహమ్మారి ధాటికి రోజూ వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాదాపు 11 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు. కొన్ని నెలల కిందటే బయటపడ్డ ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియను వివిధ దేశాలు చేపడుతున్నాయి.
ఐతే ఆ పరిశోధనలు పూర్తయి.. వ్యాక్సిన్ బయటికి రావడానికి చాలా సమయం పట్టేట్లుంది. ఈలోపు అందుబాటులో ఉన్న మందులతోనే వివిధ దేశాల వైద్యులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చివరి దశలో ఉన్న పేషెంట్ల మీద కొన్ని రకాల మందులు, కాంబినేషన్లు ప్రయోగించి చూస్తున్నారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉన్నంతలో కొంచెం మెరుగ్గా కరోనా చికిత్సకు ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు దాన్ని మించి కరోనాపై ప్రభావవంతంగా పని చేసే మందును ఆస్ట్రేలియా వైద్యులు గుర్తించారు.
అందుబాటులో ఉన్న యాంటి-పారాస్టిక్ డ్రగ్ ‘ఐవర్‌మెక్టిన్’తో కోవిడ్-19ను ఎదుర్కోవచ్చని ఆస్ట్రేలియా వైద్యుల పరిశీలనతో తేలింది. హెచ్ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఐవర్‌మెక్టిన్‌కు బాధితుని శరీరంలో నుంచి కరోనా వైరస్ క్రిములను పారదోలే శక్తి ఉందని ఆస్ట్రేలియాలో కొన్ని సంస్థలు కలిపి చేసిన స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్ కైలీ వాగ్‌స్టాఫ్ చెప్పారు.
ఐవర్‌మెక్టిన్ అనే ఔషధం ఎఫ్‌డీఏ అనుమతి పొందిన డ్రగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషదం. ఎంతో సురక్షితమైన డ్రగ్ కూడా. పలు వైరల్ ఫీవర్లపై ఐవర్‌మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించి మానవ శరీరంలో సెల్ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవచ్చని మా పరిశోధనలో తేలింది.
‘‘ఈ మెడిసిన్ సింగిల్ డోస్ ద్వారా బాధితుని శరీరంలోని వైరల్ ఆర్ఎన్ఏను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్‌తో 24 గంటల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న ఈ మందుతో చికిత్స చేస్తే మంచిది. అయితే ల్యాబ్ దశలో విజయవంతం అయిన తమ పరీక్షలను మనుషులపై క్లినియల్ ట్రయల్స్ చేయాల్సి ఉంది’’ అని వాగ్‌స్టాఫ్ పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…