Political News

ఆనందయ్య నోట సీఎం జగన్ ఇరుకున పడే మాట

ఆనందయ్య మందు ఎపిసోడ్ లో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు.. ప్రభుత్వమే అండగా నిలిచి మందును భారీ ఎత్తున తయారు చేయిస్తామని చెప్పటం తెలిసిందే. ఈ మందు తయారీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు లభించాయి. తొలుత ఈ మందు శాస్త్రీయత మీద సందేహాలు నెలకొన్నాయి. వీటిపై క్లారిఫికేషన్ ఇచ్చేందుకు జగన్ సర్కారు ఐసీఎంఆర్ఐ శాస్త్రవేత్తల సాయాన్ని కోరింది.

దాదాపు 15 రోజుల పాటు మందు తయారీ నిలిచిపోయింది. అనుమతులు లభించిన తర్వాత నుంచి మందు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆనందయ్య వెల్లడించారు. అయితే.. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులతో మెషిన్లు కాలిపోతున్నాయని.. మందు తయారీ నిర్విరామంగా సాగాలంటే కాస్త సమయం పడుతుందన్నారు. తన మీద రాజకీయ ఒత్తిడి లేదని.. తన మందును ముందుగా కొవిడ్ బాధితులకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.మందు తయారీకి సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఆన్ లైన్ లో మందును పంపిణీ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. దేశంలో అవసరమైన వారందరికి మందును అందించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆనందయ్య నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరానని.. ఇప్పటివరకు సాయం చేయలేదన్న మాట ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఆనందయ్య మందు విషయంలో తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటమే కాదు.. ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకున్నామని.. సందేహాలన్నింటిని తొలగించినట్లుగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటివేళలో స్వయంగా ఆనందయ్యే మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాయం అందటం లేదన్న మాట హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆనందయ్య నోట వచ్చిన ఈ మాటలు వీలైనంత త్వరగా సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లాలంటున్నారు. మందు తయారీకి ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందని ఆయనే స్వయంగా చెప్పిన తర్వాత కూడా సాయం అందకపోవటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆనందయ్య మందును రాష్ట్ర ప్రజలందరికి అందేలా జగన్ బాధ్యత తీసుకోవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

This post was last modified on June 8, 2021 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పహల్గాం వైరల్ వీడియో.. ఆ జంటది కాదు

సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి.…

10 minutes ago

నీళ్ళూ సినిమాలూ అన్నీ ఆపాల్సిందే

దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన…

2 hours ago

అప్ర‌క‌టిత ప్ర‌జానేత‌గా… భువ‌నేశ్వ‌రి ..!

ప్ర‌జా నాయ‌కుడు.. లేదా నాయ‌కురాలు.. కావ‌డానికి జెండా ప‌ట్టుకునే తిర‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు.…

2 hours ago

సీతని మిస్ చేసుకున్న హిట్ 3 భామ

ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…

4 hours ago

ఏప్రిల్ 27… బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌?

ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి(టీఆర్ ఎస్‌) 25 సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగ‌ల్లు.. ఓరుగ‌ల్లు వేదిక‌గా..…

4 hours ago

జైలర్ 2….ఫహద్ ఫాసిల్ పాత్ర ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…

5 hours ago