మనది 130 కోట్ల జనాభా. చాలా తక్కువ కేసులే వస్తున్నాయిలే… అనుకుంటూ సర్దుకుంటున్న భారతీయులకు రోజురోజుకు కొత్త షాకులు తగులుతున్నాయి. ఈరోజు కనీవినీ ఎరుగుని స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
ఎక్కడో వేరే దేశంలో ఇన్ని కేసులు నమోదైతే ఆశ్చర్యపోయిన మనం… ఇపుడు మనదేశంలోనే అన్ని కేసులు నమోదవడం చూస్తున్నాం. గత 24 గంటల్లో సుమారు 5 వేల కేసులు (సరిగ్గా 4987) నమోదయ్యాయి. ఇది భారత్ లో ఇప్పటివరకు రికార్డు. ఒక్క రోజులో ఇన్ని కేసులు… అది కూడా లాక్ డౌన్ 4 భారీ సడలింపులు ఇస్తారనుకున్న రోజున రావడం భయం పుట్టిస్తోంది.
150 కోట్ల జనాభా ఉన్న చైనా లో నమోదైన కేసుల కంటే భారత్ లో నమోదైన కేసుల సంఖ్య చాలా ఎక్కువ. కాకపోతే మరణాలు చాలా తక్కువ ఉండటమే ఊరట. గత 24 గంటల్లో 124 మంది మరణించారు.
ఇతర దేశాల మరణాల శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వీటితో కలిపి భారత్ లో మృతులు 2872కి చేరాయి. మొత్తం 34,109 మంది కోలుకోగా… 53946 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, కొత్త కేసులు గాని పాత కేసులు గాని ఎందులో చూసినా 3 రాష్ట్రాలదే ఈ లెక్కల్లో మెజారిటీ.
మహారాష్ట్రలో 30,706 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా… గుజరాత్ (10988), తమిళనాడు (10585), ఢిల్లీ (9333) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంటే 65 శాతం కేసులు 4 రాష్ట్రాల నుంచే వచ్చాయి. కేసుల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నా మరణాల్లో మాత్రం చాలా దిగువన ఉంది. కేసుల్లో గాని, మరణాల్లో గాని మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
This post was last modified on May 17, 2020 1:24 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…