గత కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి విషయంలో తుది నిర్ణయం జరిగిపోయిందా? పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తుది దశ వరకు పేరు వినిపిస్తున్న రేవంత్ రెడ్డి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేసేశారా? ఇక ప్రకటనే మిగిలిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పరిణామాలు గమనిస్తున్న వారు. ఒకట్రెండు రోజుల్లోనే పీసీసీ రథసారథి ప్రకటన రావచ్చునని చెప్తున్నారు.
తెలంగాణ పీసీసీ రథసారథి కసరత్తు దాదాపు ఆరు నెలలుగా సాగుతోంది! పీసీసీ చీఫ్ ఎంపిక కోసం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. గాంధీభవన్‌లో మూడ్రోజులపాటు కసరత్తు చేసి నియర్లు, కోర్ కమిటీ మెంబర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలు స్వీకరించారు. వచ్చిన పేర్లలో కొన్నింటిని హైకమాండ్ కు పంపారు. ఐదారుగురి పేర్లను పెద్దల పరిశీలనకు పంపినట్లు అప్పట్లో ఆయనే చెప్పారు. చివరి వడపోతలో జీవన్ రెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఇదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావడం , అక్కడి నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత జానారెడ్డి.. పీసీసీ ప్రెసిడెంట్ ఎంపికను ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని హైకమాండ్‌కు లెటర్ రాయడంతో బ్రేక్ పడింది.
తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి రేవంత్ రెడ్డికే పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని పార్టీలో ప్రచారం ఊపందుకుంది. దాంతో మరోసారి పార్టీలో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. రేవంత్‌ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి.. రెండు రోజుల క్రితం తానూ పీసీసీ రేసులో ఉన్నట్లు మీడియాకు తెలిపారు. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన తనకు ఫోన్ లో బెదిరింపులు వస్తున్నాయని సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. ఈ వ్యవహారం ఇలా నడస్తుండగానే రేవంత్‌కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు ఢిల్లీకి ఫోన్లు చేస్తున్నారు. ఈ గొడవతో విసిగిపోయిన కొందరు లీడర్లు.. ఎవరో ఒకరికి పదవి అనౌన్స్ చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్‌ను కోరుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కునే రేవంత్ రెడ్డికే పీసీసీ పదవి అంటూ వైరల్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడాల్సిందే.
This post was last modified on June 6, 2021 7:52 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…