ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే అన్న భావన కలిగే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. ఒకే రోజు ఉదయం ఒకలాంటి పరిస్థితి ఉండి.. సాయంత్రానికి సీన్ మొత్తం మారిపోయిన ఉదంతం చూస్తే.. అవాక్కు అయ్యేలా చేస్తోంది. సీఎం జగన్ నిర్ణయానికి చాలామంది విస్మయానికి గురవుతున్నారు. ఇక.. జగన్ ను తప్పు పట్టాలని చూసే వారు.. ఏ మాత్రం అవకాశం వచ్చినా విరుచుకుపడాలని ఎదురుచూసే వారికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడి పని తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టార్గెట్ ఇవ్వాలే కానీ.. సాధ్యం కాదనుకున్న పనిని సైతం చేతల్లో చేసి చూపించే సత్తా ఆయన సొంతం. ఇప్పటికే తన చేతలతో తన టాలెంట్ ఏమిటో చూపించుకున్న ఆయన.. పని రాక్షసుడన్న పేరుంది. పని విషయంలో విపరీతంగా శ్రమించే ఆయనకు తగ్గట్లే.. కేవలం 14 రోజుల వ్యవధిలో 500 ఆక్సిజన్ పడకల తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రిని నిర్మించిన ఘనత ఆయన సొంతం.
పక్కా ప్రణాళిక.. విపరీతమైన వేగంతో పనుల్ని పూర్తి చేయటమే కాదు.. ఒకే సమయంలో వివిధ విభాగాలు సమన్వయంతో పని చేసేలా చేసి.. ఇలాంటివి మనం కూడా చేయగలమా? అన్న రీతిలో ఆయన నిర్మించిన తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రిని చూస్తే అర్థమవుతుంది. ఆయన పని తీరుపై శుక్రవారం ఉదయం ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆన్ లైన్ లో అనంత కలెక్టర్ చంద్రుడ్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘చంద్రుడు గుడ్ జాబ్’ అని కితాబు ఇచ్చారు.
కొవిడ్ కష్టకాలంలో ఉన్న వేళ ఆక్సిజన్ నిల్వల్ని ఉపయోగించుకుంటూ ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి.. ఏపీ సర్కారు ఇమేజ్ ను మరింత పెంచుతుందన్న మాట వినిపిస్తోంది. ఆసుపత్రికి వచ్చే వారికి బెడ్ లేదన్న మాట వినిపించకూడదన్న ఉద్దేశంతో ఈ కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి అభినందనతో సంతోషాన్ని వ్యక్తం చేసిన కలెక్టర్ చంద్రుడుకు.. సాయంత్రం అయ్యే సరికి ఊహించని షాక్ తగిలింది.
తాజాగా ఏపీలో జరిగిన ఐఏఎస్ బదిలీల్లో చంద్రుడి పేరు కూడా ఉండటం గమనార్హం. అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆయన్ను.. గ్రామ.. వార్డు సచివాలయ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఉదయం గుడ్ జాబ్ అని.. సాయంత్రానికి చేస్తున్న జాబ్ ను తప్పించటమా? అన్న విమర్శలు మొదలయ్యాయి. ఇదంతా చూస్తే.. చంద్రుడ్ని బదిలీ చేయటం ద్వారా జగన్ తన ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 5, 2021 9:17 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…