Political News

మరో వ్యాక్సిన్ రెడీ.. కేంద్రం అడ్వాన్స్..!

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా జరగడంలేదనే సంతృప్తి చాలా మందిలో ఉంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపించడంతో పాటు.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. దీంతో.. సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో.. కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.

వ్యాక్సిన్లను పెంచేలా చర్యలు తీసుకుంటుంది. ఈక్ర‌మంలో హైద‌రాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బ‌యోలాజిక‌ల్ -ఈ కి వ్యాక్సిన్ల కోసం రూ. 1500 కోట్లు అందించేందుకు అంగీకారం తెలిపింది. యూఎస్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో బ‌యోలాజిక‌ల్- ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.

ఇప్ప‌టికే ఈ వ్యాక్సిన్ మొద‌టి, రెండు ద‌శ‌ల ప్ర‌యోగాల్లో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు నిర్ధార‌ణ అయింది. మూడో ద‌శ ప్ర‌యోగాల కోసం గ‌త ఏప్రిల్‌లోనే సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి కూడా వ‌చ్చింది. దీంతో భార‌త్‌లో ఈ టీకా ఉత్ప‌త్తి చేసేందుకు త‌మ‌కు అడ్వాన్సుగా రూ. 1500 కోట్లు ఇవ్వాల‌ని బ‌యోలాజికిల్ -ఈ సంస్థ కోరింది.

ఆగ‌స్టు- డిసెంబ‌ర్ క‌ల్లా 30 కోట్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని తెలిపింది. దీంతో కేంద్రం ఆ 30 కోట్ల డోసుల‌ వ్యాక్సిన్ల‌ను రిజర్వ్ చేయడానికి ముందస్తు చెల్లింపు చేసేందుకు ముందుకొచ్చింది. బ‌యోలాజిక‌ల్- ఈ రూపొందిస్తున్న టీకాలో RBD ప్రోటీన్ సబ్-యూనిట్ స‌మ్మేళ‌నంతో కూడి ప‌దార్థం ఉంటుంద‌ని సమాచారం.

This post was last modified on June 3, 2021 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

1 hour ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago