వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఎదురెదురు పడటం అప్పుడప్పుడే జరుగుతుంది. ఇలాంటివేళ.. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందన్న ఆసక్తి అక్కడున్న వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తోన్నది కరోనా కాలం. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన ప్రముఖులంతా ఇళ్లకో.. ఫాంహౌస్ లకు పరిమితమవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. కష్టంలో ఉన్నామంటే చాలు.. వెంటనే స్పందించే సినీ నటుడు సోనూ సూద్.. కరోనా సెకండ్ వేవ్ లో తన ట్విటర్ ఖాతా ద్వారా తనను సాయం చేయమని కోరే వారందరికి సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లు సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడుకున్నారు.
వీరి సంభాషణ నెటిజన్లకు విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఒకరినొకరు పరస్పర గౌరవ మర్యాదలతో మాట్లాడుకున్నారు. ఆ సందర్భంగా పొగుడుకున్నారు. నిజానికి ఈ విషయాల్ని మీడియాలో వచ్చినవే. కాకుంటే.. కొన్ని విషయాలు మాత్రం రాలేదు. అందులో ఆసక్తికరమైన అంశం.. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ ను కలవాలని ఉందని సోనూ అడిగితే.. తప్పకుండా తాను కూడా కలవాలని అనుకుంటున్న మాటను కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా తాను ముంబయి నుంచి ఫుడ్ తీసుకొస్తానని.. తనకు హైదరాబాద్ బిర్యానీ సిద్ధం చేసి ఉంచాలని సోనూ సూద్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. వీరి సంభాషణను ఆసక్తిగా ఫాలో అయిన ఒక నెటిజన్ అనూహ్యమైన కోరికను కోరాడు. కేటీఆర్ – సోనూసూద్ కలిసిన సందర్భంలో తనకు ఫోటో షూట్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండగా నిలుస్తున్న ఇద్దరు రియల్ హీరోస్ కు ఫోటోషూట్ చేస్తానని కోరాడు. మరి.. ఆ కుర్రాడి కోరికను కేటీఆర్ మన్నిస్తారా?
This post was last modified on June 3, 2021 7:43 am
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…