తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ షాకింగ్ కి గురిచేశాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ తో ఈటలకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీ మొదటి నుంచి ఉన్న ఆయన అలా సడెన్ గా పార్టీకి దూరమవ్వడం సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు.
ఇక తాజాగా ఆయన కమలం గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత నడ్డాతో భేటీ కూడా అయ్యారు. ఇలాంటి సమయంలో.. టీఆర్ఎస్ లో ఈటల స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలింది. అయితే.. ఈ ప్రశ్నకు సమాధానంగా మారేందుకు ఆ పార్టీకి చెందిన దొంతు రమేష్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
పార్టీ అధిష్టానం సైతం.. దొంత రమేష్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం కెసిఆర్ ను హుజురాబాద్ ప్రాంతానికి చెందిన తెరాస నాయకుడు దొంత రమేష్ నిన్న ప్రగతి భవన్ లో కలిశారు. ఇతనితోపాటు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఇటీవల దొంత రమేష్ కెసిఆర్ తో వరుసగా భేటీ అవుతున్నారు.
అంతేకాకుండా..హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలను దొంత రమేష్ ముఖ్యమంత్రికి ఎప్పటికపుడు అందిస్తున్నారు అని సమాచారం. కాబట్టి హుజురాబాద్ లో నెక్స్ట్ ఎవరంటే.. దొంతు రమేష్ అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. దీనిని బట్టి.. దొంత రమేష్ కి కీలక బాధ్యతలు అప్పగించినట్లే అనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే.. కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు.
This post was last modified on June 2, 2021 6:07 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…