మాజీమంత్రి ఈటల రాజేందర్ నిర్ణయం సరైనదేనా ? ఇపుడిదే ప్రశ్నపై జనాల్లో చర్చ మొదలైంది. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన టీఆర్ఎస్ ఎంఎల్ఏ తొందరలో బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసి చర్చలు జరిపారు. కాబట్టి కమలం కండువాను కప్పుకోవటం ఇక లాంఛనమనే అనిపిస్తోంది. ముందుగా రాష్ట్రంలో కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ముఖ్యనేతలతో భేటీ అయిన ఈటలకు పార్టీలో చేరటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో నేరుగా ఢిల్లీకి వెళ్ళి నడ్డాతో కూడా భేటీ అయ్యారు.
సరే ఏ పార్టీలో చేరాలనేది ఈటల ఇష్టమే. అయినా ప్రస్తుత రాజకీయ పరిస్ధితులను గమనిస్తే బీజేపీలో చేరటం సరైన నిర్ణయం కాదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీకి నిజంగా అంత సీనేమీలేదు. ఏదో గాలి వచ్చినపుడు ఓ నాలుగు సీట్లు గెలవటం తప్పించి స్ధిరమైన ఓటు బ్యాంకు, కచ్చితంగా గెలుస్తుందని చెప్పుకునేంత సీన్ లేదన్నది వాస్తవం.
పైగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను నియంత్రించటంలో నరేంద్రమోడి ఘోరంగా ఫెయిలయ్యారు. దాని ప్రభావం డైరెక్టుగా జనాలమీదే పడుతోంది. కరోనాతో లక్షల సంఖ్యలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. టీకాల కార్యక్రమం, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాలో కూడా మోడి దారుణంగా విఫలమయ్యారు. మోడి ఫెయిల్యూర్ ప్రభావం యావత్ దేశంపై తీవ్రంగా కనబడుతోంది. ఈ కారణంగానే మోడిపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతోంది.
బెంగాల్ ఎన్నికల్లోనే కాకుండా ఉత్తరప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో కూడా బీజేపీ దారుణంగా ఓడిపోయింది. అంటే యావత్ దేశంలో మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో ఈటల బీజేపీలో చేరటం అంత తెలివైన నిర్ణయం కాదేమో అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మరి మోడి, బీజేపీ విషయాన్ని ఈటల ఆలోచించకుండానే ఉంటారా ? అనేది ఇంకో సందేహం. నిజంగానే మోడి గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తెలంగాణాలో ఎన్నికలు జరిగితే ఈటెల పరిస్ధితేంటో ?
This post was last modified on June 1, 2021 12:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…