ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అనగానే.. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది చైనా. ఆ దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఆ జనాభాని కంట్రోల్ చేయడానికి ఆ దేశం.. అప్పట్లో ఓ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. ‘ ఒకరే ముద్దు.. లేక అసలే వద్దు’ ఇది ఆ దేశ సిద్ధాంతం. ఈ రూల్ ని చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. చైనాలో ఎవరైనా జంట రెండో సంతానం కావాలి అంటే.. ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. కేవలం కవలలు పుడితే మాత్రమే.. ఇద్దరు పిల్లలను ఒకే చేసేవారు. ఒకటి కన్నా ఎక్కువ కాన్పులకు అసలు ఒప్పుకున్నదే లేదు.
అలాంటిది.. తాజాగా చైనా ఈ విధానంలో మార్పు తీసుకువచ్చింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో చైనా కీలక మార్పులు చేసింది. ఒక జంట గరిష్టంగా ముగ్గురిని కనేందుకు వీలుగా మార్పులు చేసింది.
1970వ సంవత్సరం నుండి 2016 వరకు చైనాలో ఒకే సంతానం అన్న విధానం అమలైంది. జనాభా పెరగకుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని 2016లో సవరించి… ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా ముగ్గురికి పెంచారు. ఇతర దేశాల్లో యువత జనాభా ఎక్కువగా ఉండగా… చైనాలో మాత్రం వృద్ధ జనాభా పెరుగుతూ వస్తుంది. దీంతో ప్రభుత్వం మార్పులు చేసింది.
అయితే, ఏక సంతానానికి అలవాటు పడ్డ చైనా ప్రజలు… 2016లో ప్రభుత్వం ఇద్దరికి అనుమతి ఇచ్చినా పెద్దగా రిజల్ట్ కనపడలేదు. తాజాగా ముగ్గరు సంతానం నిర్ణయం తీసుకున్నారు. 2020, నవంబర్ 1 నాటికి చైనా జనాభా 141.78కోట్లు.
This post was last modified on June 1, 2021 9:23 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…