ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ తగ్గుతోందా ? ఒకప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు లేదా ? ఇప్పుడు యువ నేతలకు ఉన్న ప్రాధాన్యం.. యువ సినీ హీరోలకు లేకుండా పోయిందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. రాజకీయాలకు-సినీ గ్లామర్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలోనే కాకుండా రాజకీయ పార్టీలకు సినీ వర్గాల నుంచి మద్దతు అనేది కొత్తకాదు. ఎన్టీఆర్ ఏకంగా పార్టీ పెట్టగా ఆ పార్టీకి ఎంతో మంది సినీ ప్రముఖులు, కులాలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా సపోర్ట్ చేశారు. ఆ టీడీపీ నుంచే ఎంతో మంది వివిధ పదవులు అధిరోహించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కూడా సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వచ్చారు.
అయితే.. ఒకప్పుడు సినీ రంగం.. రాజకీయంపై చూపిన ప్రభావం ఇప్పుడు ఎక్కడా లేకపోవడం గమనార్హం. గతంలో నేతలు పోటీ చేస్తే.. గెలుస్తారనే పేరుంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేతలు కాదు కదా.. పార్టీ అధినేతలుగా ఉన్న.. వారు కూడా గెలుపు గుర్రం ఎక్కలేని పరిస్థితి ఏర్పడుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో సినీ ఫీల్డ్ నుంచి చాలా మంది పోటీ చేసినా.. హిందూపురం నుంచి బాలయ్య, నగిరి నుంచి రోజా మాత్రమే విజయం దక్కించుకున్నారు. అది కూడా వారికి వరుస విజయాలు కావడం గమనార్హం. ఇక ఎమ్మెల్యేగా పవన్ రెండు చోట్ల, పవన్ అన్న నాగబాబు ఎంపీగా నరసాపురంలో ఓడిపోయారు.
ఇక, సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వారు ఎవరూ విజయం దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి.. పరిస్థితి ఎలా ఉండబోతోంది ? అనేది ఆసక్తిగా మారింది. రాజకీయాల్లో సినీ ఫీల్డు నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఉందని అనుకున్నా.. మారుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజల్లో వారికి ఫాలోయింగ్ తగ్గిపోతుండడం గమనార్హం. ఇది… జరుగుతున్న పరిణామాలను కళ్లకు కడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలోనే పార్టీలు కూడా గతంలో మాదిరిగా సినీ గ్లామర్‌ను నమ్ముకోవడం మానేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి ప్రదానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. ప్రజల్లో సినీ నటులు విశ్వసనీయతను నిలుపుకోలేకపోవడం.. గతంలో మాదిరిగా అభివృద్ధి అజెండాతో ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడం.. వంటివి ప్రజల్లో సినీ గ్లామర్‌కు క్రేజ్ లేకుండా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. సినీ హీరోలు గ్లామర్ రాజకీయాలను నమ్ముకుని ప్రజల్లో ఉండడం లేదు. అందుకే వారిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ పరిణామాలే.. రాను రాను.. రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు మార్కులు తగ్గుతున్నాయని చెబుతున్నారు. మరి ఈ పరిస్థితి ఇలానే ఉంటుందా? మారుతుందా? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on May 27, 2021 3:33 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…