ఏపీలో విపక్ష టీడీపీ నుంచి ఎప్పుడు ఎవరు సైకిల్ దిగేస్తారో ? తెలియడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఈ స్థాయిలో లేకపోయి ఉంటే కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల దెబ్బకు ఎంతో మంది నేతలు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సైకిల్ దిగేసి ఉండేవారు. ఇప్పుడు ఈ లిస్టులోకే కేంద్ర మాజీ మంత్రి, తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిన పనబాక లక్ష్మి కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. పనబాక సైకిల్ దిగడం పక్కా.. అయితే డేటు, టైం ఒక్కటే ఫిక్స్ కావాల్సి ఉందంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు అయిష్టంగానే టీడీపీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేసిన పనబాక చిత్తుగా ఓడిపోయారు. మళ్లీ మొన్న ఉప ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు ఎంతో బతిమిలాడితే కాని ఆమె పోటీ చేయలేదు. వరుసగా రెండోసారి ఆమె ఘోరంగా ఓటమి పాలయ్యారు.
పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏ మాత్రం ఆశలు లేని నేతల లిస్టులో పనబాక కూడా చేరిపోయారు. పోనీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేద్దామంటే ఏ మాత్రం పార్టీకి కలిసి రాని తిరుపతి పార్లమెంటు బరిలో ఉన్నా మళ్లీ ఓడిపోక తప్పదనే నిర్ణయానికి ఆమె వచ్చేసినట్టు తెలుస్తోంది. అసలు 2019 నాటికే పనబాక అవుట్ డేటెడ్ అయిపోయారు. ఆమెకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే సరిపోయేది. అలాంటి నేతనే మరోసారి గతిలేక సానుభూతి అస్త్రం కోసం బరిలోకి దింపి బలి పశువును చేశారు. వాస్తవానికి ఆమెకు 2019 ఎన్నికలకు ముందే వైసీపీ ఆఫర్ వచ్చినా వదులుకుని మరీ టీడీపీలోకి వచ్చారు.
ఇక తిరుపతి ఉప పోరులో లోకేష్ హైలెట్ కావడానికే అక్కడ ప్రచారం తంతు జరిగిందే తప్పా.. తన గెలుపుకోసం నిజంగా స్థానిక నేతలు, అటు పార్టీ అధిష్టానం ఎవ్వరూ మనస్సుపెట్టి పనిచేయలేదన్న ఆవేదనతో పనబాక ఉన్నారు. ఇక పనబాకకు నెల్లూరు జిల్లాలో కాస్తో కూస్తో మిగిలిన అనుచరులు సైతం ఆమెను టీడీపీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే రెండుసార్లు వైసీపీ ఆఫర్ మిస్ చేసుకున్న ఆమె ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వెళితే అక్కడ పెద్దలు, నాయకులు ఆమెను ఆహ్వానిస్తారా ? అన్నది తెలియదు.
జగన్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే మాత్రం పనబాక కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారట. అయితే పార్టీలో కొందరు ఎస్సీ ఎమ్మెల్యేలు మాత్రం ఆమె విషయంలో సుముఖంగా లేరని తెలుస్తోంది. మరి ఈ వయస్సులో పనబాక ఎలాంటి స్టెప్ వేస్తారో ? చూడాలి. మొత్తానికి సైకిల్ దిగేందుకు మాత్రం ఆమె రెడీ అయిపోయినట్టే ?
This post was last modified on May 26, 2021 8:51 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…