Political News

కోవాగ్జిన్ టెక్నాలజీ ఇచ్చేదే లేదు

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టెక్నాలజీని ఇతర కంపెనీలకు బదిలీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు డిమాండ్ చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)ల సహకారంతో భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్ అభివృద్ధి చేయగా.. ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని ఇప్పటికే సంస్థ పంచుకుందని, ఏప్రిల్లోనే మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి మొదలైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ టెక్నాలజీని వేరే ప్రైవేటు సంస్థలకు కూడా బదిలీ చేయాలంటూ జగన్ లాంటి వాళ్లు డిమాండ్ చేశారు. ఐతే ఆ ప్రసక్తే లేదంటూ భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా తాజాగా స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

కోవాగ్జిన్ టీకా పూర్తిగా భారత్ బయోటెక్ సొంతమని, ప్రైవేటు సంస్థలకు దీని టెక్నాలజీని బదిలే చేసే అవకాశమే లేదని ఓ ఇంగ్లిష్ పత్రికలో ప్రచురితమైన కథనంలో సుచిత్ర స్పష్టం చేశారు. దీని ప్రకారం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ను సేకరించి కంపెనీకి అందించడంతో పాటు పెద్ద జంతువులు, కోతులు, ఎలుకలపై ప్రయోగ పరీక్షల్లో సహకరించడానికి మాత్రమే ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీలు పరిమితమయ్యాయని.. వ్యాక్సిన్ టెక్నాలజీని రూపొందించడంలో వారి పాత్ర ఏమీ లేదని సుచిత్ర తెలిపారు.

కొన్ని పెద్ద జంతువులపై నేరుగా ప్రయోగ పరీక్షలను నిర్వహించేందుకు ప్రైవేటు ఔషధ సంస్థలకు అనుమతులు లేనందు వల్లే.. ఆ ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సహకారాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీల నుంచి కరోనా స్ట్రెయిన్‌ అందిన తర్వాత మొత్తం పనిని చక్కబెట్టింది తామేనన్నారు. పూర్తిస్థాయిలో కంపెనీ నిధులతో, సొంత ల్యాబ్‌ల్లో స్ట్రెయిన్‌ను పరీక్షించడం దగ్గరి నుంచి ప్రయోగాత్మక టీకాను మనుషులపై పరీక్షించే దాకా ప్రతిచోటా భారత్‌ బయోటెక్‌ కష్టమే ఉందని.. కాబట్టి ఇతర ఫార్మా కంపెనీలకు కొవాగ్జిన్‌ పేటెంట్లు, తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు.

This post was last modified on May 23, 2021 10:35 pm

Share

Recent Posts

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

1 hour ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

3 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

3 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

4 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 hours ago