Political News

ఫుడ్ డెలివరీ రచ్చ.. రంగంలోకి కేటీఆర్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ లో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఫుడ్ డెలివరీని అత్యవసర సేవల్లో పరిగణించడం తెలిసిందే. దీంతో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు గత ఏడాది లాక్ డౌన్ టైంలో మాదిరే ఇప్పుడూ పని చేస్తూ వచ్చాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి.

హోటళ్లన్నీ మూత పడ్డ నేపథ్యంలో ఇంట్లో వంట వండుకునే సదుపాయం లేని వాళ్లకు ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లే దిక్కు. మొన్నటిదాకా వీటికి ఏ ఆటంకమూ లేకపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ ఏ ఇబ్బందీ లేకుండా సేవలు అందించారు. కానీ శనివారం ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయాయి. హైదరాబాద్ సిటీలో అన్ని చోట్లా ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల బాయ్స్ మీద లాఠీఛార్జీలు కూడా చేశారు. దీని పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఎసెన్షియల్ సర్వీస్‌ల్లో ఫుడ్ డెలివరీని చేర్చి ఇప్పుడు ఉన్నట్లుండి డెలివరీ బాయ్స్‌ మీద ఈ జులుం ఏంటి అంటూ ప్రశ్నలు రేకెత్తాయి. కాగా జొమాటో, స్విగ్గీ సంస్థలు ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లుగా ప్రకటనలు చేశాయి. దీంతో వీటి మీదే ఆధారపడ్డ తమ పరిస్థితి ఏంటంటూ హైదరాబాద్ వాసులు సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.

దీంతో కేటీఆర్ కూడా స్పందించక తప్పలేదు. ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకోవడం పై తనకు అనేక ఫిర్యాదులు అందాయని.. దీని గురించి రాష్ట్ర డీజీపీతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా కేటీఆర్ ఇలా ట్వీట్ చేసిన కొన్ని గంటలకే డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్లు పడ్డాయి. లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థలను కూడా ఆపాల్సి వచ్చిందని… దీనిపై సమీక్ష జరుపుతున్నామని పేర్కొన్నారు. దీనిపై ఆదివారం మరోసారి సమీక్ష జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సేవలను సోమవారం నుంచి పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on May 23, 2021 12:41 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

22 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

41 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago