ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు- నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కును నష్టాలు చూపిస్తూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిన కాడికి అమ్మేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. దాదాపు 39 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటైన ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తారా ? అంటూ.. విశాఖ సహా ఏపీ మొత్తం మోడీపై దండెత్తింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కేంద్రం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గిన సందర్భం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని.. కేంద్ర మంత్రులు వరుస పెట్టి మరీ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పార్లమెంటుకు కూడా చెప్పారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక, కార్పొరేషన్ ఎన్నికలు రావడం.. తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు, నాయకులు.. కార్మికులకు అండగా నిలిచారు. అంతేకాదు.. వారి డిమాండ్‌ను ఢిల్లీ వరకు వినిపిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక, ఏపీ సీఎం జగన్.. శారదా పీఠానికి వెళ్లిన సమయంలో ఇక్కడి కార్మిక సంఘాలు.. విమానాశ్రయంలో సీఎం జగన్‌తో భేటీ అయి.. వారి సమస్యలు చెప్పుకొన్నారు. అంతేకాదు.. అసెంబ్లీలో తార్మానం చేయాలని కూడా డిమాండ్ చేశారు. వీరి డిమాండ్‌ను అమలు చేయడంతోపాటు కేంద్రానికి తాను లేఖ కూడా రాస్తానని జగన్ హామీ ఇచ్చారు.
అన్నట్టుగానే కొన్నాళ్ల కిందటే.. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. నష్టాల నుంచి ఎలా బయట పడొచ్చో వివరిస్తూ.. ప్రధానికి అనేక సూచనలు సైతం చేశారు. ఇక, ఇంతలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఊపేసింది. దీంతో భారీ ఎత్తున ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. దీంతో ఈ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ను దేశవ్యాప్తంగా సరఫరా చేశారు. ఈ పరిణామాలతో అయినా..కేంద్ర ప్రభుత్వం విశాఖను ప్రైవేటీకరించకుండా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
ఇక, ఈ క్రమంలోనే తాజాగా ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన.. వైసీపీ ప్రభుత్వం.. బడ్జెట్ను ఆమోదించింది. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. ఈ పరిణామంతో.. జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు అయింది. మరి ఇక, మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on May 22, 2021 11:07 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…