రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సామాన్యుడు మొదలు సెలబ్రిటీల వరకూ అందరికి హైదరాబాద్ లో ఏదో ఒక పని తప్పనిసరి. ఉద్యోగం.. వ్యాపారం.. వ్యక్తిగత పనులు.. ఇలా ఏదో ఒక కారణంతో హైదరాబాద్ కు వస్తూ పోవటం తెలిసిందే. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన లాక్ డౌన్ మాటతో ఎక్కడి వారుఅక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అత్యవసరమో.. అనారోగ్యమో.. లేదంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూసేందుకు అప్పటికప్పుడు ఈ పాస్ తీసుకొని వెళ్లటం తెలిసిందే.
అలా కాకుండా హైదరాబాద్ లో చిక్కుకుపోయిన వారిని ఏపీకి తరలించే కార్యక్రమం ఇప్పటివరకూ షురూ కాలేదు. హైదరాబాద్ లో ఉండిపోయిన ఆంద్రా ప్రాంతానికి చెందిన 13వేల మంది (హైదరాబాద్ జిల్లాలో ఐదు వేలు.. రంగారెడ్డిజిల్లాలో ఏడు వేలు) ఈ – దరఖాస్తులు ఏపీ పోలీసుల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇంతమందికి ప్రైవేటు వాహనాల్లో ఏపీకి వచ్చేందుకు వీలుగా అనుమతుల్ని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సుల్ని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు తిప్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మరో రెండు రోజుల్లో ఆన్ లైన్ లో రిజర్వేషన్లు కూడా చేపడతారని చెబుతున్నారు. ఈ బస్సులు హైదరాబాద్ లోని మియాపూర్.. కేపీహెచ్ బీ.. లక్డీకాఫూల్.. ఎల్ బీ నగర్ మీదుగా ఏపీకి వెళతాయి.
ఈ తరలింపు ప్రక్రియ సాఫీగా సాగితే.. రానున్న కొద్ది రోజుల్లో చెన్నై.. బెంగళూరుల్లో చిక్కకుపోయిన ఆంధ్రోళ్లను కూడా బస్సుల్లో తీసుకు వస్తారని చెబుతున్నారు. అయితే.. ఏపీకి వెళ్లినంతనే పద్నాలుగు రోజుల క్వారంటైన్ కు ఓకే చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో చిక్కుకున్న ఆంధ్రోళ్లకు ఈ వార్త పండుగలాంటి వార్తగా చెప్పక తప్పదు.
This post was last modified on May 14, 2020 6:40 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…