కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా యావత్ దేశంలో సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇప్పుడు ప్రధానంగా రెండు అంశాలు రోగులను బాగా కుదిపేస్తోంది. మొదటిదేమో అవసరమైన స్ధాయిలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా ఉండకపోవటం. ఇక రెండోదేమో కరోనా టీకాలు దొరక్కపోవటం. కరోనా టీకాలు వేయించుకున్న వాళ్ళకు అసలు వేయించుకోని వాళ్ళకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
టీకాలు వేయించుకున్న వాళ్ళపై కరోనా ప్రభావం బాగా తక్కువగా ఉంటోంది. ఈ కారణంగానే ఇపుడందరు టీకాలు వేయించుకోవటానికి క్యూలు కడుతున్నారు. ఎప్పుడైతే జనాలంతా ఒక్కసారిగా టీకాల కోసం క్యూలు కడుతున్నారో టీకాలకు కొరత వచ్చేసింది. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం టీకాల వేయించటంలో సరైన ప్రణాళిక రచించకపోవటంతో మొత్తం అస్తవ్యస్ధమైపోయింది. ఉత్పత్తి సామర్ధ్యానికి మించి డిమాండ్ పెరిగిపోవటంతో రెండు ఫార్మాకంపెనీలు కూడా చేతులెత్తేశాయి.
ఈ సమయంలో టీకాల కొనుగోలుకు జగన్మోహన్ రెడ్డి గ్లోబల్ టెండర్లకు వెళ్ళే విషయాన్ని ఆలోచిస్తున్నారు. గ్లోబల్ టెండర్లంటే మనదేశంలో భారత్ బయోటెక్, సీరమ్ సంస్ధల నుండి టీకాలు కొనుగోలు కాకుండా అంతర్జాతీయస్ధాయిలో టీకాలు తయారుచేసే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ లాంటి సంస్ధలు తయారుచేసే టీకాలను కొనుగోలు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో టీకాల విషయంలో పెరిగిపోతున్న డిమాండ్లను తట్టుకోవాలంటే విదేశీకంపెనీల నుండి టీకాలు కొనటం ఒకటే మార్గమని జగన్ అనుకుంటున్నారు.
ఇక్కడే ఓ సందేహం మొదలైంది. అంతర్జాతీయ టెండర్లు కొనుగోలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినా దానికి కూడా కేంద్రప్రభుత్వం అంగీకారం అవసరం. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా రాష్ట్రం ఒక్కఅడుగు కూడా ముందుకు వేయలేందు. ఎందుకంటే కేంద్రప్రభుత్వం పాత్రలేకుండా నేరుగా విదేశీకంపెనీలతో ఒప్పందాలు చేసుకునేందుకు నిబంధనలు అంగీకరించవు. రాష్ట్రప్రభుత్వాలకు, విదేశీకంపెనీలకు మధ్య రేపేదైనా తేడా వస్తే అంతర్జాతీయస్ధాయిలో కేంద్రమే బాధ్యత వహించాలి. అందుకనే కేంద్రం పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి.
విదేశీ కంపెనీల నుండి టీకాలు కొనటానికి అనుమతికోరుతు నాలుగు రోజుల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఆ లేఖకు కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే దేశీయంగా అవసరమైనన్ని టీకాలను రెండు ఫార్మాకంపెనీలు ఉత్పత్తి చేయలేకపోతున్నది వాస్తవం. ఇదే సమయంలో విదేశాల నుండి టీకాల కొనుగోలుకు కేంద్రం అనుమతించటం లేదన్నదీ వాస్తవమే. మరి ఈ నేపధ్యంలో జగన్ ప్రతిపాదనకు కేంద్రం అనుమతిస్తుందా ? ఏమో చూడాల్సిందే.
This post was last modified on May 11, 2021 11:11 am
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…