ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఫస్ట్ వేవ్ వచ్చినపుడు ఒక రోజుకు గరిష్ట కేసుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య వెయ్యికి చేరితేనే వామ్మో వాయ్యో అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు రోజుకు 4 లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 3-4 వేల మధ్య ఉంటున్నాయి. ఇవి అధికారికంగా చెబుతున్న లెక్కలు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. గత ఏడాదితో పోలిస్తే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఇందుకు కారణం.. ప్రస్తుత కరోనా వైరస్ వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉండటమే అంటున్నారు నిపుణులు. ఈ వేరియంట్ బయటపడింది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అని, దేశంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఇంతగా పెరిగిపోవడానికి కారణం కూడా ఈ వేరియెంటే అని మీడియాలో వార్తలొస్తుండటం గమనార్హం. జాతీయ మీడియాలోనూ దీని గురించి చర్చ జరుగుతోంది. ఇంతకుముందు బయటపడ్డ కరోనా వేరియెంట్లలో బీ-1.617, బీ-2.618 అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. వాటిని మించి కొత్తగా బయటపడ్డ కరోనా స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైందిగా పేర్కొంటున్నారు.
గత వేరియెంట్లతో పోలిస్తే ఇది 10-15 రెట్లు అధికంగా విస్తరించే సామర్థ్యం కలిగినదని.. ఏపీ తెలంగాణల్లో విపరీతంగా కేసులు పెరిగిపోవడానికి ఈ వేరియెంటే కారణమని.. అదే దేశమంతా పాకిపోయి కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోవడానికి కారణమైందని అంటున్నారు. దీన్ని ‘ఏపీ స్ట్రెయిన్’గా పేర్కొంటుండం.. జాతీయ స్థాయిలో దాని గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం. ఐతే ఏపీ అధికారులు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఏపీలో కొత్త వేరియెంట్ లాంటిదేమీ బయటపడలేదని అంటున్నారు. దీనిపై నిపుణులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
This post was last modified on May 5, 2021 7:58 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…