లాక్ డౌన్ వేళ వలస కార్మికుల కష్టం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు. ఉన్న చోట పని లేక, తిండి, వసతి కొరవడి.. ఈ కష్టం ఎందుకులే అని సొంతూళ్లకు తరలి వెళ్లిపోతున్నారు కార్మికులు. ఐతే ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వందల కిలోమీటర్లు నడిచి అయినా వెళ్లిపోవడానికి సిద్ధమైపోయారు ఎంతోమంది.
తమ సామాను నెత్తిన పెట్టుకుని.. పిల్లల్ని సైతం నడిపించుకుంటూ వందల కిలోమీటర్లు సాగిపోతున్నారు. ఈ క్రమంలో అలసి సొలసి.. ఒళ్లు హూనం అయిపోయి.. తిండి దొరక్క వాళ్లు పడుతున్న కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. చిన్న చిన్న పిల్లలు ఆకలితో రోడ్ల మీద అలమటిస్తున్న.. కాళ్ల నొప్పులు భరించలేక బోరున విలపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయ. వీళ్ల కష్టాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాను కదిలిస్తున్నాయి.
కాగా ఓ వలస కార్మికుడు తాను కష్టపడ్డా.. తన భార్య, బిడ్డలు ఇబ్బంది పడొద్దని ఓ చిన్న ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న తోపుడు బండిని తయారు చేసుకున్నాడు. దాని మీద భార్యతో పాటు తన బిడ్డను కూడా కూర్చోబెట్టాడు. ముందు ఇనుప హ్యాండిల్ పట్టుకుని లాక్కుంటూ వెళ్లాడు. ఇలా ఏకంగా అతను 700 కిలోమీటర్ల దూరం వెళ్లడం గమనార్హం.
హైదరాబాద్‌లో ప్రయాణం ఆరంభించి మధ్య ప్రదేశ్‌లోని బాలా ఘాట్ వరకు అతను ప్రయాణం సాగించాడు. మధ్యలో తిండికి ఇబ్బంది పడ్డా ప్రయాణం మాత్రం ఆపలేదు. ఏకంగా 17 రోజుల పాటు ఇలా ప్రయాణం చేసి అతను స్వస్థలానికి చేరాడు. మామూలుగా నడవడమే కష్టం అంటే ఎండలో ఇలా బండిని లాక్కుంటూ వెళ్లడానికి అతనెంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దయనీయ వీడియోలు మరెన్నో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
This post was last modified on May 14, 2020 1:42 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…