Political News

ఈ లెక్కన చిరంజీవి అందరి కంటే గ్రేటే

సినీ తారలను వెర్రిగా ఆరాధించే అభిమానులు.. ఆ తారలు రాజకీయాల్లోకి వస్తే అంతే స్థాయిలో ఆదరిస్తారని.. తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారని గ్యారెంటీ లేదు. ఇండియాలో రాను రానూ సినీ తారల రాజకీయం మసకబారిపోతోంది. సినిమా వాళ్లు సభలు పెడితే వాళ్లను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న జనం.. తర్వాత వాళ్ల కోసం అదే స్థాయిలో పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు మాత్రం వేయట్లేదన్నది స్పష్టం. తాజాగా ఈ విషయం తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్ విషయంలోనూ రుజువైంది. ఆయన ఆదర్శ భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేశారు. జనాల్ని చైతన్య వంతులను చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఏం లాభం ఆయనతో పాటు పార్టీకి ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయం సున్నా చుట్టేసింది.

కమల్ లాగే పార్టీ పెట్టాలనుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆరోగ్య కారణాలు చెప్పి రాజకీయాల్లోకి రాకుండానే నిష్క్రమించారు. ఆయన నిర్ణయాన్ని ఇప్పుడందరూ కొనియాడుతున్నారు. చాలా మంచి నిర్ణయం అంటున్నారు. రజినీ రంగంలోకి దిగి ఉన్నా ఇంతకంటే భిన్నమైన ఫలితం రాబట్టే వారా అన్నది సందేహమే. ఇక తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయం విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని గత పర్యాయం ఎన్నికల బరిలో నిలిపితే.. ఒకే ఒక అసెంబ్లీ స్థానం దక్కింది. చివరికి ఆ నాయకుడు కూడా జెండా తిప్పేసి వెళ్లిపోయాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన పోరాడుతున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల సమయానికి ఏమాత్రం పుంజుకుంటాడో సందేహంగానే ఉంది. ఇదీ వర్తమానంలో సినీ రాజకీయ నాయకుల పరిస్థితి.

ఐతే పుష్కర కాలం వెనక్కి వెళ్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలు సాధించారు. అధికారం చేపట్టలేకపోవడం, 18 స్థానాలకు పరిమితం కావడాన్ని అప్పుడాయన పరాభవంగా భావించారు. కానీ ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే చిరు అప్పుడు గొప్ప ఫలితాలు రాబట్టినట్లే. ఆయనకు కొంచెం ఓపిక, పట్టుదల ఉండి పార్టీని కొనసాగించి ఉంటే ఇప్పుడు రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి అయ్యేవారేమో. కానీ ఆయన రెండేళ్లు తిరిగేసరికి బోర్డు తిప్పేశారు. తన రాజకీయ జీవితానికి తనే చరమగీతం పాడేసుకున్నారు. ఆ ప్రభావం తర్వాత తమ్ముడి మీదా పడింది. చిరు చేసిన పనికి ఆయన తమ్ముడిని కూడా జనాలు నమ్మడం మానేశారు. ఇప్పుడు తమిళనాట కూడా సినీ రాజకీయ నాయకుల్ని జనాలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.

This post was last modified on May 4, 2021 7:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగనే ఎక్కువ సంప‌ద సృష్టించారట

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. వైసీపీ హ‌యాంలోనే రాష్ట్రంలో సంప‌ద సృష్టి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు.…

10 hours ago

తిరుపతి ప్రసాదం పై పవన్ కమెంట్స్

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రసాదం…

10 hours ago

రాహుల్ కంటే ప్రియాంకే బెట‌ర్‌?.. కాంగ్రెస్‌లో సంకేతాలు!

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ సార‌థ్యంపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్…

10 hours ago

ఉండి టాక్‌: ర‌ఘురామ‌.. హ్యాపీయేనా…!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఆనంద ప‌డుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉండి…

11 hours ago

కొన్ని కొన్ని సార్లు మిస్ చేసుకోడమే మంచిది సిద్ధార్థ్…

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…

13 hours ago