అవును తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. ఎన్నికలకు ముందునుండే డీఎంకే అధికారంలోకి వస్తుందని మీడియా సంస్ధల సర్వేల్లో వెల్లడైంది. ఆ సర్వేల్లో ఏ సంస్ధలో కూడా ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని పొరబాటున కూడా రిజల్టు రాలేదు. దానికి తగ్గట్లే ఎగ్జిట్ పోలింగ్ సర్వేలో కూడా అన్నీ సంస్ధలు కూడా అధికారం డీఎంకేదే అని బల్లగుద్ది మరీ చెప్పేశాయి.
దాంతో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తో పాటు సీనియర్ నేతలంతా హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయారు. దానికి తగ్గట్లే శనివారం నుండి డీఎంకే ఆఫీసుతో పాటు జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో సంబరాలు మొదలైపోయాయి. స్టాలినే కాబోయే సీఎం అనే ప్రచారం మొదలైపోయేసరికి అధికారయంత్రాంగంలో కూడా మార్పొచ్చేసింది. అఖిల భారత సర్వీసులోని కొందరు సీనియర్ అధికారులు ఇప్పటికే స్టాలిన్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆఫీసుల్లో సంబరాలు మొదలైపోయాయి. తమిళనాడులో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా రెండుపార్టీల మధ్య హోరా హోరీగా పోటీ ఉండేది. అలాంటిది మొదటిసారి ఎన్నికలు ఏకపక్షంగా జరిగినట్లు అర్ధమవుతోంది. ఇటు డీఎంకేలో కానీ అటు ఏఐఏడీఎంకేలో కానీ స్టాల్ వార్ట్స్ అని చెప్పుకునే పర్సనాలిటీలు లేరు. కరుణానిధి, జయలలిత ఇద్దరు లేకుండా జరిగిన మొదటి ఎన్నిక ఇదే.
పళనిస్వామి మీద జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ప్రభుత్వాన్ని వెనకనుండి బీజేపీనే నడిపిస్తోందనే ప్రచారం రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా దాపరికం లేకుండానే వ్యవహరించారట. దాంతో బీజేపీ మీదున్న వ్యతిరేకత ఏఐఏడీఎంకే మీద కూడా చూపించేశారు జనాలు. సరే మిగిలిన పార్టీల వ్యవహారం ఎలాగున్నా డీఎంకే నేతలు మాత్రం కౌంటింగ్ కు రెండు రోజుల ముందే హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయింది మాత్రం వాస్తవం.
This post was last modified on May 2, 2021 9:39 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…