ఏపీ సీఎం జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తన తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేసిన రోజు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసిన కేబినెట్లో 90 శాతం మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని… 10 శాతం మంత్రులు మాత్రమే కంటిన్యూ అవుతారని చెప్పారు. తొలి టర్మ్‌లో జగన్ చాలా మంది జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. జగన్ కేబినెట్లో చోటు కోసం ఐదారుసార్లు గెలిచిన వారు కూడా రేసులో ఉన్నారు.
మరో మూడు, నాలుగు నెలల్లో జరిగే మార్పులు, చేర్పుల్లో చాలా మంది సీనియర్లు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే వీరిలో అందరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న గ్యారెంటీ అయితే లేదు. తొలి టర్మ్‌లో ఎలా అయితే తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు వచ్చాయో ? ఇప్పుడు ప్రక్షాళనలో కూడా కొందరు జూనియర్లకు అలాగే మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం అయితే జరుగుతోంది. ఇందుకు సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు కూడా కలిసి రానున్నాయి. ఈ లిస్టులో చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వేంకటేగౌడ కూడా ఉన్నారు.
వేంకటేగౌడ తొలిసారే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గెలపు ఓ సంచలనం. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఆయన భారీ మెజార్టీతో ఓడించారు. అయితే ఇప్పుడు ఆయన కేబినెట్ రేసులో పైన ఉండడానికి ప్రధాన కారణం.. ఆయన సామాజిక సమీకరణలే. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కులంతో పాటు సీమ ఈక్వేషన్ కూడా కలిసి రానుంది. ఇదే వర్గం నుంచి కృష్ణా జిల్లాలో జోగి రమేష్ సీనియర్ ఎమ్మెల్యే అయినా.. జిల్లా ఈక్వేషన్ రమేష్‌కు మైనస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో కమ్మ, కాపు ఈక్వేషన్లను మార్చే ఛాన్సులు లేవు. ఇక ఇవన్నీ కలిసి రావడంతో పాటు వేంకటేగౌడ బాస్ అయిన మంత్రి పెద్దిరెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో ఆయనకు మంత్రి పదవి సులువుగా వస్తుందన్న చర్చలే వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి వేంకటేగౌడకు మంత్రి పదవి లక్ ఎంత వరకు కలిసి వస్తుందో ? చూడాలి.
This post was last modified on May 1, 2021 9:42 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…