క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కడప పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించమంటు బయట పెద్ద బోర్టులు, బ్యానర్లు పెట్టేయటం కలకలం సృష్టిస్తోంది. దీనికి ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్న కారణాలు ఏమిటయ్యా అంటే కరోనా వైరస్ నేపధ్యంలో చికిత్స అందిస్తున్న తమ వైద్యులను ప్రభుత్వం వేధిస్తున్నదట. ఇందుకు నిరసనగా అసలు కోవిడ్ రోగులను చేర్చుకోవటమే మానేశారు.
అసలు విషయం ఏమిటంటే కోవిడ్ రోగులకు చికిత్సను అందించటంలో భాగంగా కొన్ని ఆసుపత్రులు నిర్దేశించిన ఫీజులకన్నా బాగా ఎక్కువగా వసూళ్ళు చేస్తున్నాయట. ఆరోపణలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిపెట్టింది. అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాత రెండు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులుచేశారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. దాంతో మిగిలిన ఆసుపత్రులకు కూడా బాగా మండింది.
ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల స్ధానంలో తమిష్టం వచ్చినంత ఫీజులు వసూలు చేసుకుంటామన్న ధోరణిలో ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ఎనిమిది ఆసుపత్రులు కోవిడ్ రోగలను చేర్చుకోవటం మనేశాయి. ఒక్కసారిగా ఎనిమిది ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులను చేర్చుకోవటం ఆపేయటంతో ఇబ్బందులు మొదలైపోయాయి.
ఇదే విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది ఆసుపత్రుల నిర్ణయంతో తమకు సంబంధం లేదన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు శుక్రవారం కలెక్టర్ తో భేటీ అవుతున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అవుతుందనే అనుకుంటున్నట్లు రెడ్డి తెలిపారు. మరి కలెక్టర్- ఆసుపత్రుల యాజమాన్యం భేటిలో ఏమవుతుందో చూడాలి.
This post was last modified on April 30, 2021 11:11 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…