రాష్ట్రంలో ఒకటి తర్వాత ఒకటిగా టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండేళ్ల జగన్ పాలనలో ఇప్పటి వరకు అనేక మంది సీనియర్లు అరెస్టయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ చీఫ్‌గా ఉన్న అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వంటివారిని అరెస్టు చేసి, రాజకీయంగా వారిపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కేవలం వీరిని అరెస్టు చేయడమేనా?.. జగన్ ఉద్దేశం.
అయితే.. కేవలం అరెస్టు చేయడమే అయితే.. జగన్‌కు కానీ, వైసీపీకి కానీ.. వచ్చే లాభం ఏంటి? టీడీపీకి వచ్చే నష్టం ఏంటి? అనే విషయాలపైఇప్పటి వరకు పెద్దగా చర్చకు రాలేదు. కానీ, ఇప్పుడు వ్యూహాలు మారాయి. జగన్ రెండు ప్రయోజనాలను ఆశించి.. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. వీటిలో ఒకటి.. నేతల ఇమేజ్ ఫుల్లుగా డ్యామేజీ చేసి.. వారిని అవినీతి నాయకులుగా.. ప్రజల సొమ్ము తినేవారుగా చిత్రీకరించడం. రెండు.. ఆర్థికంగా వారిని దెబ్బతీయడం. ఈ రెండు విషయాలే కాకుండా మరిన్ని రీజన్లు కూడా ఉన్నాయని అంటున్నా.. ప్రధానంగా ఈ రెండు రీజన్లను కీలకంగా చేసుకుని.. కేసులు ముమ్మరం చేస్తున్నారు.
టీడీపీ నేతలను పరిశీలిస్తే.. సంస్థాగతంగా వారికి వారి వారి నియోజకవర్గాల్లో పలుకుబడి.. ప్రజాబలం మెండుగా ఉంది. అచ్చెన్న అయినా.. దేవినేని అయినా.. జేసీ అయినా.. ధూళిపాళ్ల అయినా.. ఎవరికి వారు వారివారి నియోజకవర్గాల్లో పేరు తెచ్చుకున్నారు. వీరిలో అచ్చెన్న మినహా… గత ఎన్నికల్లో వైసీపీ సునామీ కావొచ్చు.. లేదా మరో రీజన్ కావొచ్చు ఓడిపోయారే తప్ప.. ప్రజాబలం లేని నాయకులు కాదు. సో.. వీరిని దెబ్బతీయడం ద్వారా టీడీపీని దెబ్బతీయాలనేది ప్రధాన లక్ష్యంగా జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అదేసమయంలో ఆర్ధికంగా వారి మూలాలను ఏరివేయడంద్వారా.. తన స్థానాలను మెరుగు పరుచుకోవడం అనేది దాగి ఉందని చెబుతున్నారు పరిశీలకులు. అయితే.. ఇది సాధ్యమా? అసాధ్యమా? అనేది ఇప్పటికిప్పుడు ఎవరూ ప్రెడిక్ట్ చేయలేకపోయినా.. జరుగుతున్న తతంగంలో జగన్ వ్యూహాలను మాత్రం అర్ధం చేసుకుంటున్నారు. తాను గెలవలేనప్పుడు ప్రత్యర్థుల బలహీనతలపైనా.. బలాలపైనా దెబ్బకొట్టడం అనే రాజకీయాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 29, 2021 11:25 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…