ఔను! పార్టీ పెట్టిన రెండేళ్లకే.. వైసీపీ అధినేత.. తనకంటూ.. ఓ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇతర పార్టీల నుంచి రిజైన్ చేసి వచ్చిన వారిని ఉప ఎన్నికలో తన పార్టీపై గెలిపించుకున్నారు. ఇక, 2014లో ఏకంగా 67 మంది ఎమ్మెల్యేలను సాధించి.. ప్రధాన ప్రతిపక్షం అనే కీర్తిని దక్కించుకున్నారు. ఇక, పార్టీ పెట్టిన పదోఏటే.. 151 మంది ఎమ్మెల్యేలతో రికార్డు స్థాయి విజయం దక్కించుకుని.. అందరినీ సంచలనంలో ముంచేసి.. అధికారంలోకి వచ్చారు. మరి.. ఈ తరహా వ్యూహం.. అడుగులు జనసేన పార్టీకి ఎక్కడివి ? అంటున్నారు పరిశీలకులు.
జనసేన పార్టీ పెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే.. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలను ఆయన గెలిపించుకోలేక పోయారు. పోనీ.. ఏపీలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేను కూడా నిలబెట్టుకోలేక పోయారు. పవన్ కోసం మేం ఉన్నా అనే పార్టీ కేడర్ లేకుండా చేసుకున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేం కృషి చేస్తాం .. అనే మేధా సంపత్తిని కూడా ఆయన సాధించలేక పోయారు. వెరసి మొత్తంగా.. జనసేన ఇప్పుడు కేవలం షో కేస్ పార్టీగా మారిపోయింద ని అంటున్నారు పరిశీలకులు. కేవలం చూసేందుకు మాత్రమే షోకేస్‌లో ఉన్న వస్తువులు వినియోగపడ తాయి తప్ప.. వాడుకునేందుకు కాదని సెలవిస్తున్నారు.
వ్యక్తిగత జీవితంలో అయినా.. ప్రజాజీవితంలో అయినా.. ఒక తప్పు.. పది విజయాలకు దారితీసేలా పునాదులు వేయాలి. కానీ, పవన్ విషయంలో తప్పులపై తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఆదిలో టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు పోటీ చేయలేదు. ఇక, గత ఎన్నికలకు వచ్చే సరికి రెండు పార్టీలకూ దూరమయ్యారు. అప్పుడు పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఇక, ఆ తర్వాత.. బీజేపీతో జట్టు కలిపారు. తెలంగాణలో ఇప్పుడు బీజేపీతో కయ్యానికి రెడీ అయ్యారు. ఏపీలో మాత్రం స్నేహం చేస్తున్నారు. మరోవైపు లోపాయికారీగా.. ఏపీలో టీడీపీతో దోస్తీ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఇంకోవైపు.. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ఎన్నికల్లో బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇదేంటి ? అని ప్రశ్నించిన తెలంగాణ బీజేపీపై విమర్శలు గుప్పించారు. మీరు మమ్మల్ని అవమానించారని వ్యాఖ్యానించారు. ఇక, కేంద్రంతో దోస్తీ అంటూనే.. కేంద్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలను పట్టించుకోరు.. పార్టీని బలోపేతం చేస్తానని చెబుతూనే షూటింగులకు సై అంటున్నారు. మేధావులు వెళ్లిపోతున్నా.. చీమకుట్టినట్టయినా లేదు. ఇక, కేడర్ కకావికలం అవుతున్నా .. పట్టించుకోవడం లేదు. ఇదీ.. జనసేనకు ఈ ఏడేళ్ల ప్రస్థానంలో ఉన్న హిస్టరీ!! మరి దీనిని షో-కేస్ పార్టీ అనక ఏమనాలి? అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 26, 2021 6:40 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…