టీడీపీలో సరికొత్త విషయం చర్చకు వస్తోంది. తమ్ముళ్లు ఈ విషయాన్ని తలుచుకుని కలవరపడుతున్నారు కూడా..! ఆ విషయం ఏంటి అంటారా ? అదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. అయితే.. ఓడిపోయినప్పటికీ.. ఒక విషయం మాత్రం తమ్ముళ్లకు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా స్పష్టంగా తెలిసింది. అదేంటంటే.. పార్టీ ఓడిపోయింది.. కానీ.. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌లకు వచ్చారు. దీని వెనుక వారు పంచిన డబ్బులు పనిచేశాయి. వైసీపీ నేతలు ఓటుకు ఇంతని పంచితే.. టీడీపీ నేతలు సైతం.. అంతో ఇంతో పంచారు. అందుకే.. కనీసం గౌరవ ప్రదమైన ఓట్లయినా.. వారికి లభించాయి.
ఇక, ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను తీసుకుంటే.. మాత్రం సీన్ రివర్స్అయిపోయింది. టీడీపీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. చంద్రబాబు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే.. స్థానికంగా నేతలు మాత్రం పట్టు సడలకుండా.. పోటీకి సై అన్నారు. పోటీకి రంగంంలోకి దిగారు.. అయితే.. అధ్యక్షుడు చంద్రబాబే ఎన్నికలను బహిష్కరించిన తర్వాత.. స్థానికంగా నేతలకు ఆర్థిక సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రజలకు డబ్బు పంపకాలు జరగలేదు. ఫలితంగా ఓట్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మొత్తంగా స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకుకు, పరిషత్‌లో వచ్చిన ఓటు బ్యాంకుకు చాలా తేడా కనిపించింది.
ఈ విషయంపై టీడీపీలో పెద్ద ఎత్తున సమాలోచనలు జరిగాయి. మొత్తంగా తేల్చింది ఏంటంటే.. ఓటర్లకు డబ్బు పంచక తప్పదని…! ఇదే ఇప్పుడు టీడీపీని కలవర పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంచకపోతే.. ఎవరూ ఓటు వేసేందుకు వచ్చే పరిస్థితి లేదని.. దీనికి సంబంధించి నాయకులు రెడీ అవ్వాల్సిందేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీలో అందరి నేతల మధ్య ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.
అయితే.. ఇప్పుడు అధికార పార్టీ ఆర్థికంగా బలంగా ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. మరోవైపు.. ప్రజలకు డబ్బులు పంచేందుకు కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని బలంగా డీ కొట్టాలంటే.. అంతకు మించి ప్రజలను ఆకర్షించాల్సిన అవసరం టీడీపీకి ఉంది. మరి ఇంత మొత్తం నిధులు ఎవరు ఇస్తారు? ఎలా వస్తాయి? చంద్రబాబు సర్దుబాటు చేయకపోతే.. ఎలా ..? మళ్లీ ఓటమేనా? అని నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబు గతంలోలా డబ్బు సర్దుబాటు చేయట్లేదన్న విమర్శలు కూడా పార్టీ నేతల్లో ఎక్కువుగా వినిపిస్తున్నాయి.
This post was last modified on April 23, 2021 7:16 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…