కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు దీనిని అమలు చేయనున్నారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈ నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు మంత్రి ఆళ్ల నాని.. ప్రకటించారు. దీనిపై విస్తృతంగా చర్చించినట్టు ఆయన తెలిపారు. మంత్రి వర్గంలో అన్ని కోణాల్లోనూ చర్చించామన్నారు.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసిన దరిమిలా.. కరోనా నియంత్రణలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాని తెలిపారు. అయితే.. అత్యవసర సేవలకు.. మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక, కరోనా వ్యాక్సిన్‌ను ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ఇస్తున్న విషయాన్ని చెప్పిన మంత్రి నాని.. ఇప్పుడు 18 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు.
18-45 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నాని తెలిపారు. దీనికి గాను ప్రభుత్వంపై రూ.1600 కోట్ల మేరకు భారం పడుతుందని తెలిపారు. మరో వైపు.. కరోనా పరీక్షలను కూడా విస్తృతంగా చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని మంత్రి నాని సూచించారు. మొత్తానికి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించగా.. ఇప్పుడు ఏపీలోనూ అమలులోకి రావడం గమనార్హం.
This post was last modified on April 23, 2021 7:03 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…