కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతగా కల్లోలం రేపుతోందో తెలిసిందే. గత ఏడాది ఇదే సమయానికి ఉన్న తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు రెండు మూడు రెట్లు తీవ్రంగా ఉంది వైరస్. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. బెడ్లు ఖాళీ లేవు. ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో చేరిన రోగులకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడం కూడా కష్టమవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి వందల టన్నుల్లో ఆక్సిజన్‌ను వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటు నుంచి కూడా రోజూ వందల టన్నుల ఆక్సిజన్ వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఐతే ఒక చోటి నుంచి ఆక్సిజన్ ట్యాంకులను ప్లాంట్లకు పంపి, అక్కడి నుంచి గమ్య స్థానానికి ఆక్సిజన్ తెప్పించుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ స్థితిలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ అద్భుత ప్రయత్నం చేసింది.
తెలంగాణకు ఒడిషాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ వస్తుండగా.. ఇక్కడి నుంచి ట్యాంకులను పంపి, తిరిగి తెప్పించుకోవడానికి మూడు రోజుల సమయం పడుతుండటంతో ప్రభుత్వం అత్యవసర మార్గాన్ని ఎంచుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయంతో ఫైటర్ ప్లేన్స్ తెప్పించి.. వాటిలో ట్యాంకులను పంపి.. ఆక్సిజన్ నింపి.. తిరిగి హైదరాబాద్‌కు తీసుకొస్తోంది. ఒకేసారి తొమ్మిది ట్యాంకులను పంపి.. 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తెప్పిస్తుండటం విశేషం. ఈ ప్రక్రియ అంతే కొన్ని గంటల్లో ముగిసిపోతోంది.
ఇందుకోసం భారీగా ఖర్చవుతున్నప్పటికీ.. అత్యవసర పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించకుండా ఈ మార్గాన్ని ఎంచుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడి ఇంటిక ిపరిమితం కాగా.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. దీని పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
This post was last modified on April 23, 2021 7:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…