తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పట్టు సాధించాలని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. దీంతో చిత్తూరు జిల్లాపై కాన్‌సన్ ట్రేట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో లోకేష్‌ను బలంగా ప్రచారానికి దింపారు. ఇంతా చేస్తే.. ఎన్నికల సమయానికి దొంగ వోట్ల కలకలం రేగింది. అధికార పార్టీ నేతలే దొంగో ఓట్లు వేయించారంటూ.. బస్సుల్లో జనాలను తరలించారంటూ.. చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వీడియోలు సేకరించారు. ఫోన్ సంభాషణల ఆడియోలను సాక్ష్యాలుగా చూపిస్తూ..తిరుపతిలో జరిగిన ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయా సాక్ష్యాల వీడియోలు, ఆడియోలను కూడా పంపించారు. ఇంత వరకుబాగానే ఉన్నా.. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి విజయానంద్ కూడా నివేదికలు ఇచ్చారు. అయితే.. వీరు ఇచ్చిన నివేదికల్లో మాత్రం అంతా సవ్యంగానే సాగిందని.. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని.. దొంగ వోట్లు వేసే అవకాశం కూడా లేదని వారు స్పష్టం చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం చేరవేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నిక అనే విషయాన్ని పక్కన పెట్టింది. అదే సమయంలో చంద్రబాబు రాసిన లేఖలు, సాక్ష్యాలను కూడా బుట్టదాఖలు చేసినట్టు ఢిల్లీ వర్గాల నుంచి టీడీపీ నేతలకు సమాచారం వచ్చింది.
దీంతో ఇప్పుడు టీడీపీ నేతల మధ్య మే-2 ఫీవర్ పట్టుకుంది. ఆ రోజు.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానుంది. ఆ రోజు ఎన్నికల్లో కనుక టీడీపీకి ఘోరమైన పరాజయం వస్తే.. ఏం చేయాలి? ఏవిధంగా ఎదురు దాడికి సిద్ధమవ్వాలి? అనే విషయంపై సమాలోచన చేస్తున్నట్టు టీడీపీ వర్గాల నుంచి సమాచారం. అయితే.. ఇప్పటికిప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ ఎలాగూ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో తాము కూడా ఇంప్లీడ్ అయి.. సదరు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పిస్తే.. జగన్ సర్కారును ఇరుకున పెట్టినట్టు అవుతుందని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. మరి చంద్రబాబు వినతిని కోర్టు ఏమేరకు పరిష్కరిస్తుందో చూడాలి.
This post was last modified on April 23, 2021 12:25 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…