పిచ్చి పీక్సుకు చేరుకుంటే ఎలాగుంటుందో వివాదాస్సద ఆధ్యాత్మిక గురువు నిత్యానందను చూస్తే చాలు అర్ధమైపోతుంది. లైంగికపరమైన కేసుల్లో అరెస్టయి, కోర్టు విచారణ జరుగుతున్నపుడే నిత్యానంద దేశం నుండి పరారయ్యారు. ఇండియాలో ఉన్నపుడు రకరకాల వేషాలతో నోటికొచ్చిన విషయాలపై మాట్లాడే ఈ గురువుకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే శిష్యులున్నారు.
ఇలాంటి గురువు దేశంనుండి పారిపోయి ఎక్కడో ఈక్వెడార్ అనే దేశంలో తేలారు. ఈక్వెడార్ కు సమీపంలోని ఓ చిన్న దీవికి పారిపోయారు. ఆ దీవిని నిత్యానంద కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపధ్యంలో ఓ విచిత్రమైన ఆదేశాలను నిత్యానంద జారీచేశారు. తానుంటున్న లేదా కొనుగోలు చేసిన దీవికి కైలాస అనే పేరుపెట్టిన విషయం తెలిసిందే.
కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక మిలిటరీ, ప్రత్యేక వీసా, పాసుపోర్టు లాంటి ఎన్నో ప్రత్యేకతలను ప్రకటించారు. దాంతో మనదేశంలో నిత్యానంద పెద్ద క్యామిడి స్టార్ అయిపోయారు. అలాంటి కైలాస దేశానికి మనదేశం నుండి జనాలను నిషేధించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తమ దేశంలోకి భారతీయులను నిషేధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేయటమే పెద్ద క్యామిడి అయిపోయింది.
మనదేశమనే కాదు బ్రెజిల్, యూరోపుదేశాలు, మలేషియా లాంటి దేశాల నుండి కూడా ప్రయాణీకులను కైలాసకు రాకుండా నిషేధించినట్లు ప్రకటించటంతో నెటిజన్లు ఒకటే నవ్వుకుంటున్నారు. కైలాసియన్లు, ఎకైలాసియన్లు, తమ దేశ రాయబార కార్యాలయంతో సంబంధాలున్న వాలంటీర్లంతా క్వారంటైన్లోకి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీచేశారు నిత్యానందులవారు.
This post was last modified on April 23, 2021 10:19 am
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…