అవును షర్మిలను కరోనా వైరస్ సెకెండ్ వేవ్ గట్టి దెబ్బ కొట్టింది. అంటే ఆమెకు కరోనా వైరస్ సోకిందని కాదు అర్ధం. ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో మూడు రోజులపాటు షర్మిల దీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె దీక్ష ముగియగానే రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లోను రిలే నిరాహార దీక్షలు చేయాలని పిలుపిచ్చారు. ఆమె పిలుపుకు సానుకూలంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరుద్యోగులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు దీక్షలకు దిగారు.
అయితే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉందన్న విషయం తెలిసిందే. దీక్షల వల్ల జనాలు ఒకేచోట గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి బాగా పెరిగిపోతుందన్న ఉద్దేశ్యంతోనే దీక్షలను వాయిదా వేసుకుంటున్నట్లు షర్మిల ఆఫీసు ఓ ప్రకటన జారీచేసింది. ఇప్పటికే షర్మిల పిలుపు మేరకు చాలా జిల్లాల్లో దీక్షలకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా మరికొంతమంది అక్కడే ఉన్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో అంతమంది ఒకేచోట చేరటం ప్రమాదకరమని షర్మిల అభిప్రాయపడినట్లు ప్రెస్ నోట్ స్పష్టంచేసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమవంతుగా బాధ్యత ఫీలవ్వటం వల్లే దీక్షలను వాయిదా వేసుకోవాలని షర్మిల అందరినీ కోరారు. నిజానికి ఆమెకూడా మూడు రోజుల దీక్షను ఇందిరాపార్కు దగ్గరే చేయాలని అనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగానే పోలీసులు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతించారు. అందుకనే ఒకరోజు ఇందిరా పార్కు దగ్గర మిగిలిన రెండు రోజులు లోటస్ పాండ్ లోని తనింటి దగ్గరే చేశారు. మొత్తానికి ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో షర్మిల చేయాలని అనుకున్న ఆందోళనకు కరోనా వైరస్ గట్టి దెబ్బే కొట్టినట్లయ్యింది.
This post was last modified on April 22, 2021 11:41 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…