తిరుపతి పార్లమెంటు స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి పెద్ద దెబ్బగా మారే పరిస్తితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ తన విశ్వరూ పం చూపించిందంటూ.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం.. టీడీపీ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో 38శాతం ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు.. తిరుపతి ఉప పోరుకు వచ్చే సరికి 28శాతంకన్నా.. తగ్గిపోతుందని ఎగ్జిట్ పోల్‌లో స్పష్టమైంది.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకుంది. ఈ క్రమంలో పార్టీకి దక్కిన ఓటు షేర్.. 39శాతం. ఇక, అప్పటి నుంచి ఓటు బ్యాంకు పెంచుకునేందుకు చంద్రబాబు ప్రయ త్నాలు చేస్తున్నప్పటికీ.. సాధ్యం కావడం లేదు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను చివరి నిముషంలో చంద్రబాబు బహిష్కరించారు. అయినప్పటికీ.. చాలా చోట్ల టీడీపీ నాయకులు పోటీ చేశారు. ఇదో చిత్రమై న పరిస్థితి. అయితే.. కోర్టు కేసుల కారణంగా ఫలితం ఇంకా వెలువడలేదు. కానీ, ఈలోగా తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో ఓటు షేర్ మాత్రం బాగా పడిపోయిందని ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది.
పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. ఇద్దరూ కూడా సీఎం జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఇది ఆశించిన మేరకు ఫలితం ఇవ్వడం లేదు. పైగా ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టడం లేదు. ఇక, ఇప్పటికైనా చంద్రబాబు పద్ధతి మార్చుకుని.. 2024 ఎన్నికలకు ముందుగానే జగన్‌పై రాజకీయాలు చేయాలని పరిశీలకులు అంటున్నారు. ఇదిలావుంటే, అధికార పార్టీ తిరుపతిలో 64% ఓట్లు తమకే దక్కుతాయని భావిస్తోంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి ఇది భారీ విజయమేనని భావిస్తున్నారు.
ఇక, ఆది నుంచి తిరుపతి ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీకి.. ఇక్కడ భారీ ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. 6-7శాతం ఓట్లే పడతాయని అంచనావేస్తున్నారు. ఇవి కూడా జనసేన వర్గాల నుంచి పడుతున్నవేనని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో జనసేనకు బీజేపీ కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప మిగిలింది ఏమీ లేదు. ఒకవేళ బీజేపీకి జనసేన మద్దతు కనుక లేకపోతే.. 3శాతం ఓటు బ్యాంకే దక్కుతుందని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం.
This post was last modified on April 18, 2021 3:09 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…