దేశంలో మళ్లీ గత ఏడాది పరిస్థితే.. తెరమీదకి వస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇదే సమయానికి లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ప్రబుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోంను అమలు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో వర్క్ ఫ్రం హోంను మించిన మార్గం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రొటేషన్ పద్ధతితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు ఉంటాయా? అనే అంశంపై అధికారులు యోచిస్తున్నారు.
ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కొంతమంది ఇప్పటికే కరోన బారిన పడ్డారు. దీంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు పాజిటీవ్ వచ్చింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల్లో సచివాలయంలో ఇద్దరు అధికారు లు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అదేసమయంలో మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేప థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని భావిస్తున్న సీఎంలు.. త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌కు కరోనా సోకిన నేపథ్యంలో సోమవా రం ఏపీ సీఎం జగన్.. అన్ని శాఖల అధికారులతోనూ కోవిడ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక, తెలంగాణలోనూ సీఎం కేసీఆర్.. సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో అప్రకటిత లాక్ డౌన్‌తోపాటు.. రాత్రివేళ కర్ఫ్యూ ఆలోచన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. మరో నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు కరోనా ముప్పు తప్పేలా లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 18, 2021 3:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…