రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వారసులు వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా తెరమీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లోనూ వారసులు పోటీ చేశారు. అయితే.. ఇది ఏకపక్షంగా టీడీపీ నుంచే కనిపించింది. కానీ.. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయ తెరమీదికి వచ్చేందుకు కొందరు వారసులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అయితే.. వీరంతా ప్రజల్లోకి వస్తున్నారా ? రాజకీయంగా చక్రం తిప్పుతున్నారా ? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. దీంతో వీరినిగమనిస్తున్నవారు.. తండ్రి చాటు తనయులుగానే ఉంటున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి చూస్తే.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, యనమల రామకృష్ణుడు కుమార్తె, బుచ్చయ్య చౌదరి సోదరుడి కుమారుడు, మాగంటి కుటుంబం నుంచి రెండో కుమారుడు.. వంటివారు చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇక గత ఎన్నికల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడి నిరాశపడ్డ రాయపాటి, కోడెల వారసులు లైన్లోనే ఉన్నారు. ఈ సారి గుంటూరు జిల్లా నుంచి యరపతినేని, జీవి. ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీథర్ వారసులు పొలిటికల్ తెరను అల్లాడించేందుకు రెడీ అవుతున్నారు.
వీరు కాకుండా చాలా మంది తెరవెనుక ఉన్నారని తెలుస్తోంది. ఇక, గత ఎన్నికలలోనే కొంతమంది కొత్తవారికి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే.. వారంతా కూడా విఫలమయ్యారు. ఇక, ఇప్పుడు కొత్తవారు తెరమీదకి వస్తున్ననేపథ్యంలో వారికి టికెట్ ఇచ్చినా గెలుస్తారా ? అనేది ప్రశ్న. పోనీ.. ఇప్పటి నుంచి ప్రజాబాహుళ్యంలో ఏమైనా తిప్పుతు న్నారా ? అంటే అది కూడా కష్టమే.. అంటున్నారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోనూ వారసుల వరుస బాగానే కనిపిస్తోంది. ఏకంగా మంత్రి బొత్స తనయుడు, స్పీకర్ సీతారాం తనయుడు, నూజివీడు ఎమ్మెల్యే తనయుడు, ప్రభుత్వ చీఫ్ విప్.. శ్రీకాంత్ రెడ్డి సోదరుడు, వంటివారు కనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు వీరు అధికారికంగా.. ప్రకటించకపోయినా.. నియోజకవర్గాల్లో మాత్రం చక్రం తిప్పుతున్నారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కొడుకు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వీరు కొంత మేరకు నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నా.. టీడీపీ నేతల తనయులు మాత్రం.. ఎక్కడా కనిపించడం లేదు. కానీ, పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
This post was last modified on April 18, 2021 11:57 am
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…